BigTV English

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..
CM Revanth Reddy news

CM Revanth Reddy news(Latest political news telangana):


దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఈ ఒప్పందాలలో అదానీ సంస్థ అత్యధికంగా 12 వేల 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించేందుకు అదానీ సంస్థ చొరవ చూపించింది. అదే విధంగా పలు విద్యుదుత్పత్తి సంస్థలతో పాటు.. బ్యాటరీ సెల్‌ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు…. డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.


అలానే తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు…. ఆరాజెన్‌ లైఫ్‌సైన్సెస్‌…. రూ.2 వేల కోట్ల రూపాయలతో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అంబుజా సిమెంట్ కంపెనీ సైతం 1400 కోట్ల రూపాయలతో పెట్టుబడులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలతో గోద్రెజ్ కెమికల్ ప్లాంట్ పెట్టుబడులు పెట్టనుండగా… జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 9వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక గోడి ఇండియా 8 వేల కోట్లు.. గ్రీన్ వర్క్స్ డాటా సెంటర్ 5 వేల 200 కోట్ల పెట్టుబడులు….. 250 కోట్లతో ఖమ్మంలో పామ్ ఆయిల్ గార్డెన్ లకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×