BigTV English

CM Revanth Reddy: కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్.. గులాబీ బాస్‌ తీరుపై సీఎం రేవంత్ ఫైర్..

CM Revanth Reddy: కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్.. గులాబీ బాస్‌ తీరుపై సీఎం రేవంత్ ఫైర్..
CM Revanth Reddy Fires on KCR

CM Revanth Reddy Fires on KCR(Telangana politics): కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్ అని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. నియమాల ప్రకారం ఛాంబర్ ఇవ్వాలి.. ఇచ్చామన్నారు. కానీ ఇక్కడే ఇవ్వాలి అని లేదా.. ఇది ఇవ్వద్దు అని లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.


మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి కేసీఆర్.. KRMB ఇష్యూ తీసుకుంటున్నారని సీఎం విమర్శించారు. మీ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి ఏపీ సీఎం జగన్ తుపాకులు పంపి గుంజుకునే పని చేశారన్నారు. మూడు రోజులు పోలీసులు ఉంటే.. అప్పుడు మీరెక్కడ పడుకున్నారని సీఎం ఘాటుగా ప్రశ్నించారు. ప్రతీ రోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది కేసీఆర్ కాదా..? అని రేవంత్ విమర్శలు గుప్పించారు.

కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం చిత్తశుద్ధిని ప్రజలందరూ చూసారన్నారు. అందుకే కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు గట్టి తీర్పునిచ్చారని తెలిపారు. అసలు కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారన్నారు. కేసీఆర్ కమిట్ మెంట్ మీద ప్రజలకు కూడా అర్థమైందని.. దాని మీద ఎవరికైనా డౌట్ ఉందంటే అది హరీష్ రావుకే అని దుయ్యబట్టారు.


Read More : ఉచిత విద్యుత్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్.. 81 లక్షల దరఖాస్తులు..

సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరామని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించామని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరుకాకపోవడంపై సీఎం స్పందించారు. రాష్ట్ర గవర్నర్ ప్రసంగానికి రాలేదంటే అతని బాధ్యత అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పదేళ్లు శాసన సభ మంత్రిగా చేసిన హరీష్ అవగాహన రాహిత్యం అర్ధమవుతుందని సీఎం మండిపడ్డారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మేము భాద్యులం అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రావాలి అని.. ప్రతిపక్ష నేతగా సభలోకి రావాలని కోరుకుంటున్నట్టు రేవంత్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించినట్లు తెలిపారు. దీనిపై మంత్రివర్గంలో కానీ అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం చేశిన తప్పులను పునరావృత్తం చేయమని సీఎం తెలిపారు. ఉద్యోగ నియామక విషయంలో క్లారిటీగా ఉన్నామన్నారు. ఎలాంటి విధానపరమైన లోపాలు లేకుండా పరిపాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×