BigTV English

CM Revanth Reddy: ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth ReddyCM Revanth Reddy Old City Metro Inauguration: పాత బస్తీని ఓల్డ్ సిటీ అంటుంటారనీ.. ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీనికోసం 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒల్డ్ సిటీలో రోడ్ల విస్తరణకు రూ. 200 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇక మూసీని సుందరీకరిస్తామని.. అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తామని తెలిపారు.

మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌కే కాదు ఓల్డ్ సిటీకి కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ముందు చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతుందని తెలిపారు. రాజకీయాలు వేరని అభివృద్ధి వేరని హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలసి పని చేస్తామని సీఎం అన్నారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Read More: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. నల్గొండ బరిలో మాజీ మంత్రి తనయుడు..

సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో సీఎం స్థాయికి ఎదిగారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్‌కు పాతబస్తీ గుండెకాయ అని.. పాతబస్తీ అభివృద్ధి కోసం సీఎం ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి,మూసీ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. పాతబస్తీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×