ప్రత్యేక దేశం కోసం కొట్లాడుతున్న బలుచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ రైళ్లు టార్గెట్ గా దాడులకు దిగుతున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని జకోబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ మీద బాంబును అమర్చారు. సుమారు 270 మంది ప్రయాణీకులతో వచ్చిన జాఫర్ ఎక్స్ ప్రెస్ ఆ బాంబు మీది నుంచి వెళ్లే సమయంలో భారీ విస్పోటనం సంభవించింది. ఈ ఘటనలో రైలులోని పలు బోగీలు ఎగిరిపడ్డాయి. సుమారు 6 కోచ్ లు పట్టాల మీది నుంచి పక్కకు పడిపోయాయి. ఓ కోచ్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అయిఏ, ఎవరూ చనిపోలేదని అధికారులు వెల్లడించారు. జాఫర్ రైలు క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తుండగా ఈ ఘటన జరినట్లు తెలిపారు. ఈ పేలుడుకు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోచ్ ల లోపల పలువురు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
అందకు ముందు కూడా అదే ప్రాంతంలో రైల్వే ట్రాక్ లను పరిశీలిస్తున్న పాక్ రక్షణ దళాలను టార్గెట్ గా చేసుకుని బలుచిస్తాన్ ప్రత్యేకవాదులు బాంబు పేల్చారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేట్టారు. ఈ దాడికి కూడా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
నిజానికి జాఫర్ ఎక్స్ ప్రెస్ పై దాడి జరగడం ఈ ఏడాది రెండోసారి. మార్చిలో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలుచిస్తాన్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. వందలాది మంది పౌరులను బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ సైనికులను దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ రంగంలోకి దిగడంతో బందీలను విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఏకంగా 214 మంది పాక్ సైనికులను చంపేసినట్లు బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత జూన్ లో జాకోబాబాద్ లో పట్టాలపై డిటోనేటర్లు పెట్టి నాలుగు బోగీలు పట్టాలు తప్పేలా చేశారు. ఈ ఘటనలో 21 మంది ప్రయాణీకులు, నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా పేలుళ్లతో దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు వీలైనంత త్వరగా చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ మార్గంలో రైల్వే సేవలు నిలిపివేయబడతాయని వెల్లడించారు. బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన పడుతున్నది. ఈ సమస్యపై ఏం చేయాలని అక్కడి పాలకులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.
Read Also: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!