BigTV English

Health Tips : ఊపిరితిత్తుల సమస్యలకు చక్కని చిట్కాతో చెక్‌

Health Tips : ఊపిరితిత్తుల సమస్యలకు చక్కని చిట్కాతో చెక్‌
Check For Lungs problems with Good Tips
 

Check For Lungs problems with Good Tips: మారుతున్న కాలానుగుణంగా చాలామంది చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాహనాల పొగతో గాలి పూర్తిగా కలుషితం అయింది. వాయు కాలుష్యంతో చాలామంది ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఉంటారు. అటువంటి ఊపిరితిత్తులను శుభ్రపరిచాలంటే కొన్ని ఆహారపదార్థాలను మనం రోజూ తినే ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరితిత్తుల సమస్యకు చెక్‌ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్య నిఫుణులు చెబుతున్నారు. కొన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసినట్టే అని తెలుస్తోంది. కొన్ని రకాల ఇంట్లో ఉపయోగించే ఆయుర్వేద పదార్థాలు కూడా మేలు చేస్తాయి.


ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఆహారాలలో తేనె చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది అతి ముఖ్యమైనదిగా చెబుతుంటారు. తేనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా ఊపిరితిత్తులను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజు ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఒక స్పూన్ తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు.

Read More: కలవరపెడుతున్న ప్యారెట్ ఫీవర్.. ఎలా వ్యాపిస్తుంది ? వ్యాధి లక్షణాలు, చికిత్స వివరాలు


ఇక ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో రెండవ అతి ముఖ్యమైనది పసుపు. ఇది కూడా ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేసే క్రమంలో పచ్చి పసుపును వాడడం ఎంతో మంచిదని చెప్పాలి. పచ్చి పసుపు కొమ్మును నమిలి తిన్నా, లేక పచ్చి పసుపును దంచి పాలల్లో కలుపుకొని తాగినా మంచి రిజల్ట్స్ ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పచ్చి పసుపును వారానికి మూడు నాలుగు సార్లు తింటే సరిపోతుందని, ఇది శ్వాసకోశ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి సహజంగా పనిచేసే నివారిణి అని చెబుతున్నారు. అంతేకాదు పసుపు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని చెబుతున్నారు.

ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవాలనుకునే వారు ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అల్లం టీ తాగినా, ఏదైనా సలాడ్లలో అల్లంను ఉపయోగించినా, మరే రకంగా అయినా నిత్యం అల్లం తీసుకున్నా మన ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడేవారు, ఇన్ఫెక్షన్లతో సతమతమయ్యేవారు ఈ నేచురల్ రెమెడీస్‌ను ఇంట్లోనే ట్రై చేసి ఊపిరితిత్తులను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్లు సూచిస్తున్నారు. మరి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి.

Disclaimer : పైన తెలిపిన వార్త ఆరోగ్య నిపుణుల సలహా మేరకు, పలు అధ్యయనాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాం.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×