Hyderabad News: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. వచ్చేవారం నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్‌లో జరిగిందే జూబ్లీహిల్స్ బైపోల్ లో జరుగుతుందన్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జరుగుతున్న పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ ఓయూ కాలనీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామిలు పర్యటించారు.
ఈ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. వర్షాల కారణంగా చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులు వివరించారు స్థానిక నేతలు. వీలైనంత వేగంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ఛానెల్‌తో మాట్లాడారు. జూబ్లీహిల్స్ బైపోల్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో జరిగిందే జూబ్లీహిల్స్‌లో జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఇంకా అపోహల్లో ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదేనంటూ బీఆర్ఎస్ చెబుతున్న మాటలపై ఆయన రియాక్ట్ అయ్యారు.
ALSO READ: గిరిజన వర్సెస్ గిరిజనేతర గ్రామాల్లో ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే
గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు తెలుసుకున్నారని, అందుకు మార్పు కోరుతున్నారని అన్నారు. రేషన్ కార్డుల మొదలు సన్నబియ్యం వరకు తాము చేసి చూపించామన్నారు. నగరంలో సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో చాలామంది ఉన్నారనే విషయంపైనా నోరు విప్పారు సదరు మంత్రి. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ హైకమాండ్ దే ఫైనల్ నిర్ణయమన్నారు. అభ్యర్థి ఎంపికలో మాకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. క్షేత్రస్థాయిలో ముగ్గురు మంత్రులు, అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బీసీ రిజర్వేషన్‌పై పిటిషన్ న్యాయస్థానంలో ఉందని, దాని గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తాము తిరగడం లేదని, జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను పరిశీలన చేస్తున్నామని అన్నారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి
యూసఫ్‌గూడ డివిజన్లోని కృష్ణానగర్‌లో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులపై ఆదేశాలు
డివిజన్‌లో నాలాల సమస్యలు, సీసీ… pic.twitter.com/BJtnCyt5G9
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2025