E-Paper
Advertisement

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం, రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని.. ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

నీటి వాటాలపై అప్రమత్తత అవసరం

Advertisement

రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వాటాల విషయంలో మంత్రులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూనే.. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. సభలో మంత్రుల అటెండెన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

విపక్షాలపై అటాకింగ్ వ్యూహం

Advertisement

సభలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రులు అటాకింగ్ మూడ్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ వంటి సభా నియమాలను ఉపయోగించుకుంటూ.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వడమే కాకుండా.. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు.

మంత్రులకు దిశా నిర్దేశం..

అసెంబ్లీ సమావేశాల పొడిగింపు లేదా తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 4వ తేదీన మళ్ళీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ లోపు మంత్రులు తమ తమ శాఖలపై పూర్తి సమాచారంతో ఉండాలని, ప్రజల్లోకి ప్రభుత్వ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ALSO READ: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×