BigTV English
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల జాతర.. ఉపాధికి కొదువ లేకుండ చర్యలు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల జాతర.. ఉపాధికి కొదువ లేకుండ చర్యలు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ది పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని సీఎం అన్నారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు.

గత ఏడాది ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి.. అవి ఏయే దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారిగా పెట్టుబడులు వచ్చాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కు ముందుకు వచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని తెలిపారు. కంపెనీల వారిగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం చర్చించారు.

Also Read: BRS on Kaushik Reddy: పవర్ పోయినా పొగరు తగ్గలేదట.. ఆ ఎమ్మేల్యేపై మండిపడుతున్న నెటిజన్స్

ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు ముఖ్యమంత్రి దావోస్ లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటన లో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ 6 రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు.

Related News

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

CM Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్.. అందుకే ఫామ్‌హౌస్‌కి, తారలతో తిరిగే కల్చర్ ఎవరిది?

Ramagundam Temple Demolition: మైసమ్మ ఆలయాల కూల్చివేతపై రాజకీయ రగడ.. 48 గంటల్లో పునర్నిర్మాణం చేయాలనీ బీజేపీ అల్టిమేటం..

CM Revanth Reddy: కేటీఆర్‌ను శ్రీలీల ఐటెం సాంగ్‌తో పోల్చి.. పరువు తీసిన రేవంత్

Kavitha: పాలిటిక్స్ ‘వర్సెస్’ పర్సనల్.. కవిత సంచలన కామెంట్స్, ఆ పార్టీతో చర్చలు.. చర్చించడాలు లేవ్

Big Stories

×