Hyderabad: ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-5 తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో ఇరువురు పలు అంశాలపై మాట్లాడుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని మంగళవారం ఉదయం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్, అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ఛైర్మన్ ప్రిన్స్ రహీం అగాఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్స్ రహీం తన టీమ్‌ను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా అగాఖాన్ ఫౌండేషన్‌పై ఇరువురు చర్చించుకున్నారు. ఈ ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందన్నారు సీఎం రేవంత్. మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు.
ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించినట్టు వివరించారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించామని వివరించారు. దీనికితోడు మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు అగాఖాన్ ఫౌండేషన్ నుంచి సహకారాన్ని కోరారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవన నిర్మాణం, ఇప్పుడున్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తావించారు.
అంతేకాదు మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతామని, అందుకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడుదారుల గురించి ప్రస్తావించారు. డిసెంబర్‌లో 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు తప్పకుండా హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ALSO READ: రౌడీషీటర్ నయీమ్ దారుణ హత్య.. హైదరాబాద్‌లో ఓ వైన్ షాపు ముందు ఘటన, సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, సింగపూర్‌కు చెందిన కంపెనీ దీనికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు , పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
CM Revanth Reddy held a courtesy meeting with Prince Rahim Aga Khan V at the Taj Falaknuma Palace.
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి అజారుద్దీన్,ప్రభుత్వ ప్రధాన… pic.twitter.com/KRw5CHn2XJ
— Congress for Telangana (@Congress4TS) September 15, 2026