E-Paper
Advertisement

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!
Advertisement

 

Airtel Rs 1749 Plan: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రకరకాల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎక్కువగా చూసేవారికి మరీ ముఖ్యంగా యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ వంటి ప్రీమియం సేవలను కోరుకునే వారికి ఎయిర్‌టెల్ ఒక అద్భుతమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. నెలకు రూ. 1749 ధరకు లభించే ఈ ప్లాన్ కాస్త ఖరీదైనదే అయినప్పటికీ.. ఇందులో లభించే ప్రయోజనాలు, ఫ్యామిలీ మెంబర్స్‌తో డేటాను పంచుకునే వెసులుబాటు దీనిని ప్రత్యేకంగా మారుస్తోంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

అపరిమిత డేటా, ఫ్యామిలీ కనెక్షన్లు

Advertisement

ఈ రూ. 1749 ప్లాన్‌ ద్వారా వినియోగదారులు ఒక ప్రైమరీ సిమ్ కార్డ్‌తో పాటు మరో నాలుగు సెకండరీ (యాడ్-ఆన్) సిమ్ కార్డ్‌లను ఉచితంగా పొందొచ్చు. ఈ నాలుగు అదనపు సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక డేటా విషయానికి వస్తే.. ప్రైమరీ, సెకండరీ వినియోగదారులందరికీ 4G/5G అపరిమిత డేటా లభిస్తుంది. అయితే కంపెనీ ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) కింద ప్రతి 30 రోజులకు 300GB డేటా పరిమితిని విధించింది. దీంతో పాటు వినియోగదారులందరికీ రోజుకు 100 SMSల బెనిఫిట్ కూడా అందుతుంది.

Also Read: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌.. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ, గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, అడిషనల్ బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ లో హైలెట్ గా నిలిపేది దీనిలోని ఓటీటీ ప్రయోజనాలే. వినోదం కోసం ఇందులో నెట్‌ఫ్లిక్స్, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్, ఏడాది పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్, గూగుల్ వన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా ఉచిత హలోట్యూన్స్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ సేవలు కూడా ఇందులో అందిస్తున్నారు. అయితే రూ. 1749 ప్లాన్ కు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి రావడం గమనార్హం.

Also Read: Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Tags

Related News

యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

Big Stories

Advertisement
×