E-Paper
Advertisement

మ్యాజిక్ ఫిగర్ కోసం దక్షిణాదిని బలి చేస్తారా? కేంద్రంపై రేవంత్ ఫైర్

మ్యాజిక్ ఫిగర్ కోసం దక్షిణాదిని బలి చేస్తారా? కేంద్రంపై రేవంత్ ఫైర్
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పెంపును ప్రధాని మోదీ ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల ఉనికిని, రాజకీయ ప్రాముఖ్యతను దెబ్బతీసే కుట్ర అని ఆయన అభివర్ణించారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి కలిగే ముప్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 208 ఎంపీ సీట్లు పెరుగుతాయని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. దీనివల్ల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కేవలం ఉత్తరాది రాష్ట్రాల నుండే వచ్చేస్తుందని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత పూర్తిగా కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ మనుగడకు ఏమాత్రం మంచిది కాదని, దక్షిణాదిని రాజకీయంగా ఏకాకిని చేసే కుట్ర అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

1967లో 520గా ఉన్న లోక్‌సభ స్థానాలను, 1976లో ఇందిరా గాంధీ 542కు పెంచారని.. సిక్కిం చేరికతో అది 543కు చేరిందని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణతో అమలు చేయడం వల్ల ఇక్కడ జనాభా పెరగలేదని.. అదే సమయంలో ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరిగిందని వివరించారు. ఇప్పుడు కేవలం జనాభాను ప్రాతిపదికన తీసుకుంటే.. పద్ధతిగా ఉన్న దక్షిణాదికి శిక్ష వేసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వాజపేయి కూడా ఇందిరా గాంధీ నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గాల విభజనపై సంయమనం పాటించారని పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్స్ వంటివని సీఎం గుర్తు చేశారు. “జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు మాకు రివార్డు ఇవ్వాల్సింది పోయి, శిక్ష వేస్తారా?” అని ప్రశ్నించారు. అందుకే జనాభా మాత్రమే కాకుండా, రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (GSDP) ఆధారంగా డీలిమిటేషన్ జరగాలని ఆయన ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాదికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న దక్షిణాదికి అన్యాయం చేయడం వివక్షేనని మండిపడ్డారు. మల్కాజిగిరి వంటి నియోజకవర్గాల జనాభా గోవా వంటి మూడు రాష్ట్రాల జనాభాతో సమానమని.. ఈ వ్యత్యాసాలను గుర్తించాలన్నారు.

Advertisement

మహిళకు 33 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతుంద‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా సీట్లు పెంచుతున్నారని రేవంత్ ఆరోపించారు. “ఇది వివక్షకు దారితీయదా? తెలంగాణలో నక్సలిజం ఎందుకు వచ్చింది? అణచివేత ఉన్నప్పుడే ఉద్యమాలు పుడతాయి.” అని హెచ్చరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కీలక పదవులన్నీ ఉత్తరాది వారికే దక్కుతున్నాయని.. దక్షిణాది నేతలను బలహీనులను చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ వెంటనే అఖిలపక్ష సమావేశం పిలిచి ఏకాభిప్రాయం సాధించాలని డిమాండ్ చేశారు. దిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సీట్ల సంఖ్య తగ్గడం వల్ల రాజకీయంగా బలహీనవర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచేలా కేంద్రం వ్యవహరించకూడదని హితవు పలికారు. బీజేపీ నేతలు, ముఖ్యంగా ఎంపీ లక్ష్మణ్ వంటి వారు యూపీ నుండి రాజ్యసభకు వెళ్లడం వల్లే ఆ ప్రాంత ప్రయోజనాల కోసం దక్షిణాదికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఈ వివక్ష భవిష్యత్తులో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు, ఉద్యమాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

Read Also: విజయ్‌కు సలహాలివ్వను.. నా పిల్లలకే నేను చెప్పను: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×