CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యింది? కేవలం 365 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలేంటి? తెలంగాణతోపాటు హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టింది? గత ప్రభుత్వానికి – రేవంత్ సర్కార్‌కీ తేడా కళ్లకు కట్టికట్టు కనిపించిందా? అభివృద్ధి వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందా? అవుననే అంటున్నారు ప్రజలు, అధికారులు.
రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఏడాది పాలనలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీకావు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని పనులు చేసి చూపించింది. అన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది.
రైతు రుణమాఫి: స్వతంత్ర భారతదేశంలో అతిపెద్దది రైతుల రుణ మాఫీ. ఏ రాష్ట్రమూ ఇవ్వలేనన్ని అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు, రైతులకు అత్యధిక సన్న బియ్యం బోనస్, ఏ రాష్ట్రానికి సాధ్యం కాని అత్యధిక వరి ఉత్పత్తి.
మూసీ ప్రక్షాళనకు అడుగులు: 40 సంవత్సరాల తర్వాత ఆక్రమణలు పూర్తిగా నిలిపివేశారు. చెరువుల పునరుద్ధరణ చాలా కీలకమైన అంశం. 50 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మూసీ నది పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చింది. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేలా భవిష్యత్తుకు తగ్గట్టుగా మౌలిక వసతుల రూపకల్పన చేపట్టిన దేశంలో ఫస్ట్ నగరం హైదరాబాద్.
రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు: భారతదేశంలో తొలి పరిశ్రమ ఆధారిత నైపుణ్య విశ్వవిద్యాలయం. దక్షిణ భారత్‌లో అతిపెద్ద క్రీడల విశ్వవిద్యాలయంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి ఉచిత విద్యుత్, రైతులకు 24×7 విద్యుత్ సదుపాయం వంటివి ఇందులో కీలకమైనవి.
3 వేల విద్యుత్తు బస్‌లు: హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించింది. 3,000 వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం మరో అంశం. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, 200 ఎకరాల గాంధీ స్మారక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం గోదావరి నుంచి త్రాగు నీరు సరఫరా చేయడం మరో అంశం.
మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో..: భవిష్యత్ నగర ప్రణాళికలు అన్నీఇన్నీకావు. భారత్‌లో అత్యాధునిక నగరంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌తో పాటు నాలుగో నగరానికి శ్రీకారం చుట్టింది. రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లల కోసం ఆహార, కాస్మెటిక్ ఛార్జీలు పదేళ్ల తర్వాత పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, పారిశ్రామికవేత్తలకు రుణాలు- లక్ష మంది మహిళా కోటీశ్వరులను సృష్టించే లక్ష్యం.
కుల జనగణన, ధరిణి పోర్టల్: సమగ్ర కుల జనగణన – విధానాలు, కేటాయింపుల సమీక్షలతోపాటు దళిత, గిరిజన, బీసీ మరియు మైనారిటీ విద్యార్థుల కోసం ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేస్తోంది. అవినీతితో కూడిన ధరణి పోర్టల్‌ను పూర్తిగా జాతీయ సంస్థ NICకి అప్పగించి కీలక మార్పులు చేపట్టింది.
మాదక ద్రవ్యాలపై పోరాటం: ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను కలుసుకునే అవకాశం, మీడియా స్వేచ్ఛ పునరుద్ధరణ భవిష్యత్ తరాలకు హానికరం కాకుండా మాదక ద్రవ్యాలపై పోరాటం, తొలి ఏడాదిలో గరిష్ఠ పెట్టుబడుల ఆకర్షణ – విదేశీ, దేశీయ, ప్రజా పెట్టుబడులు.
మెట్రో విస్తరణ: ప్రాంతీయ రింగ్ రోడ్, రింగ్ రైలు ప్రాజెక్టులు, మెట్రో రైలు విస్తరణ – తదుపరి దశ ప్రారంభం టియర్-2 పట్టణాల్లో పారిశ్రామికాభివృద్ధి మొదలైనవి. వరంగల్ రెండో రాజధానిగా భారీ అభివృద్ధి ప్రాజెక్టులు శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం 400,000 ఇళ్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల విలువైన యూనివర్సల్ హెల్త్‌కేర్ సదుపాయాలు కల్పించింది.
పనులన్నీ చకచక..: ప్రజా వాణిలో 5 లక్షల ప్రజా సమస్యల పరిష్కారం చేపట్టింది. ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపు మరో కీలకమైన అంశం. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర గౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తయారైంది.
తెలంగాణకు ప్రత్యేక గీతం.. ప్రజల ఐక్యతను పునరుద్ఘాటించేలా రూపొందించింది. ఈ గీతం ద్వారా రాష్ట్ర స్వాభిమానాన్ని ప్రోత్సహించడమే అసలైన లక్ష్యం. తెలంగాణ ప్రతిష్ఠకు కొత్త సూచిక రాష్ట్ర శోభకి, గౌరవానికి ప్రతీకగా TG అనే సంక్షిప్త రూపాన్ని చిహ్నంగా ఎంపిక చేసింది.
రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. ప్రతిరోజూ 18 గంటలు పని చేసే ముఖ్యమంత్రి, ప్రజల సమస్యలను వినే శ్రద్ధ, పరిపాలనలో మెరుగుల కోసం ఫీడ్ బ్యాక్ తీసుకునే వినమ్రత వల్ల తెలంగాణ ఇప్పుడు నిజమైన భవిష్యత్ రాష్ట్రంగా ఎదుగుతోంది.