Fire Accident: ఢిల్లీ సుప్రీం కోర్టు ఆవరణలో స్పల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు హాల్ 11, 12 మధ్య ఉండే హాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కోర్టు హాల్లో ఒక్కసారిగా మంటలు రావడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్రంగా పొగ రావడం వల్ల అక్కడున్నవారికి ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. వెంటనే అగ్గ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యుదాఘాతం కారణంగా మంటలు ఏర్పడినట్లు సుప్రీంకోర్టు యాజమాన్యం తెలిపింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సిబ్బంది తెలిపింది.