Hyderabad News: విలాసవంతులకు కేరాఫ్‌గా మారింది టెస్లా కారు. ఆ కారుంటే ఆ ఓనర్ డబ్బున్నోళ్ల జాబితాబాలో చేరిపోతాడు. ఎందుకంటే లగ్జరీకి కేరాఫ్ గా మారింది ఆ వాహనం. తాజాగా హైదరాబాద్ రోడ్లపై తొలి టెస్లా కారు పరుగులు తీస్తోంది. ఇంతకీ ఎవరు దక్కించుకున్నారు? ఆ కారు గురించి కొనుగోలుదారుడు ఏం మన్నాడు? అనేదానిపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్‌లో టెస్లా కారు పరుగులు
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కారు. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లపైకి అడుగుపెట్టింది. సిటీకి చెందిన ఓ డాక్టర్ ఈ కారును కొనుగోలు చేశాడు. కొంపల్లిలోని సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్ ప్రవీణ్ టెస్లా కార్లలోని మోడల్ వై ని కొనుగోలు చేశాడు.
ముంబైలో టెస్లా షోరూమ్ ఓపెన్ తర్వాత కారు బుక్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 3 గంటలకు డెలివరీ తీసుకున్నాడు కూడా. దేశంలో నమోదైన ఆరో టెస్లా కారు ఇదే. ముంబై నుంచి హైదరాబాద్‌కు సుమారు 770 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వచ్చినట్టు తెలిపారు.
పన్నుల మాటేంటి?
ప్రయాణ మధ్యలో పుణె, షోలాపూర్ ప్రాంతాల్లో ఒకసారి చార్జింగ్ చేసినట్టు వివరించాడు. భారతీయ సంస్కృతిలో ఏ వాహనమైనా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాలంటే కచ్చితంగా వాహన పూజ చేయాల్సిందేనని రాసుకొచ్చాడు. అక్టోబర్ 1న ఎక్స్ వేదికగా ఆయన ఈ పోస్టు చేశారు. ఆ పోస్టుకు ఎలాన్ మస్క్, టెస్లా ఇండియాకు ట్యాగ్ చేశాడు.
వరంగల్ భద్రకాళి ఆలయంలో డాక్టర్ ప్రవీణ్ ఈ పూజ చేశాడు. రెడ్ కలర్‌లో ఉన్న కొత్త టెస్లాకి పూల మాలలతో అలంకరించారు. చక్రాలపై పసుపు కుంకుమలతో ఆలయం ముందు నిలబడగా కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ వస్త్రాల్లో కనిపించాడు.
ALSO READ: బిగ్ టీవీ ఎఫెక్ట్.. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సస్పెన్షన్
ఇండియా ఏ వాహనం కొనుగోలు చేసినా తొలుత ఆలయానికి తీసుకెళ్లి పూజ చేయడం సంప్రదాయం. నిమ్మకాయలు తొక్కించడం, పూల దండలు వేయడం, పసుపు కుంకుమలు పూయడం చేస్తుంటారు. కొన్నేళ్లుగా ఆచారం వస్తోంది కూడా. ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది టెస్లా. మోడల్ Y ధరలు ఈ విధంగా ఉన్నాయి.
రియర్-వీల్-డ్రైవ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.59.89 లక్షలు ఉంది. అదే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ రూ. 67.89 లక్షలు. ఆన్ రోడ్ ధర రూ. 61 లక్షలు అవుతుంది. ఇండియాలో డెలివరీలు అక్టోబర్ నుంచి మొదలయ్యాయి. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్‌కు రూ.6 లక్షలు అదనం కూడా.
మరి పన్నుల మాటేంటి? టెస్లా కారు అంటే లగ్జరీకి కేరాఫ్‌గా ప్రస్తుత రోజుల్లో చెబుతున్నారు. అందులోనూ విదేశాల నుంచి రావడంతో పన్నులు భారీగానే ఉంటాయి. వాస్తవానికి ఈ కారు ధర 63 లక్షలు రూపాయలు. పన్నుల కారణంగా అమాంతం పెరిగిందని రాసుకొచ్చాడు.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు ఉందని, కానీ కారుని మహారాష్ట్రలో కొనుగోలు చేశామన్న కారణంతో 22 శాతం పన్ను వసూలు చేసినట్టు పేర్కొన్నాడు. చాలా నిరాశ కలిగించిందని మనసులోని మాట బయటపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ టెస్లా కారు బుక్ చేసుకుంది. సిటీలో మొదట డెలివరీ తీసుకున్న వ్యక్తినని తానేనని వెల్లడించాడు.
No car , including Tesla, can get a five star safety rating in Indian culture, unless a vahan Pooja is done @elonmusk @TeslaClubIN @Tesla_India 😀🙏🏻😛 pic.twitter.com/5TxuGQzcPY
— Dr Praveen koduru (@drpraveenkoduru) October 1, 2025