CM Revanth Reddy: వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క,జూపల్లి క్రిష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి, జిల్లా శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త కోటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక తొలిసారి వనపర్తికి వస్తున్నారు. వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెళ్లి విరుస్తోంది.
వనపర్తి జిల్లాలో 721 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తొలుత వేంకటేశ్వరస్వామి దేవాలయం సందర్శించి అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు ప్రారంభిస్తారు. వనపర్తి ఐటీ టవర్స్ పనులకు కొబ్బరికాయ కొట్టనున్నారు. అలాగే నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు మొదలుపెడతారు.
పెబ్బేరులో 30పడకల హాస్పటల్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ZPHS, జూనియర్ కళాశాలలో అభివృద్ది పనులకు శిలాఫలకముల ఆవిష్కరిస్తారు. కె.డి.ఆర్. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పథకములు పంపిణీ చేస్తారు. ఇందిరమ్మ మహిళా శక్తి రేవంతన్న భరోసా పథకం ప్రారంభోత్సంలో పాల్గొంటారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ లబ్దిదారులకు కుట్టుమిషన్ల పంపిణీ చేస్తారు. లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీలో రేవంత్ పాల్గొంటారు. నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా నియామక పత్రముల అందచేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభ జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి 43 ఏళ్ల క్రితం వనపర్తిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. తన అన్నతో కలిసి ఉన్న ఆ అద్దె ఇంటిని చూసేందుకు ప్రస్తుతం అక్కడికి వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాల నిమిత్తం వనపర్తి వస్తున్న సీఎం రేవంత్ ఇంటి ఓనర్ పార్వతమ్మను కలవనున్నారు. ఆత్మీయంగా పలకరించనున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఉన్న ఆ అద్దె ఇల్లు ప్రస్తుతం ఎలా ఉంది? ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? వారు ఏం చేస్తున్నారు? వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓ లుక్కేద్దాం.
Also Read: సీఎం రేవంత్ టన్నెల్ ప్రదర్శన
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంటి వస్తున్నారని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఉండే సమయంలో రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని ఇంటి ఓనర్ పార్వతమ్మ గుర్తుచేసుకున్నారు. తాను చేసిన కూరలు అంటే రేవంత్ రెడ్డికి ఎంతో ఇష్టమని పార్వతమ్మ తెలిపారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తన భర్తను మామ అని ఆప్యాయంగా పిలిచేవారని పార్వతమ్మ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన కొడుకు, కూతురు రేవంత్ రెడ్డిని మామ అంటూ పిలవడం ఎంతో సంతోషంగా ఉందని పార్వతమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
తమ ఇంట్లో ఉండి చదువుకుని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ ఇంటికి రావడం ఎంతో అదృష్టం అంటున్నారు వనపర్తి జిల్లాకు చెందిన పార్వతమ్మ. రేవంత్ తమ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని తాను చేసిన కూరలు అంటే ఆయనకు ఎంతో ఇష్టమని పార్వతమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.