E-Paper
Advertisement

CM Revanth Reddy: కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు.. ఉమెన్స్ డే ఈవెంట్‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy: కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు.. ఉమెన్స్ డే ఈవెంట్‌లో సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలలకు వరాలు జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ సిటీలో ఈవీ వాహనాలు ఎవరు కొనుగోలు చేసినా జీరో ట్యాక్స్ అని అన్నారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.

కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు-సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, హైదరాబాద్ సిటీ ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో మహిళా జర్నలిస్టుల గురించి మాట్లాడారు.

వారికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు ప్రాధాన్యత ఉందన్నారు.  ఈ దేశానికి రాష్ట్రపతి మొదలు ప్రధాని, లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అలాంటి మహిళా నేతృత్వంలో పని చేస్తున్న ఈ పార్టీ, ఉక్కు మహిళ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు.

Advertisement

తెలంగాణ మహిళలు తయారు చేసే వస్తువులను అమెజాన్‌లో అమ్మకానికి అవకాశం కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేసినట్టు తెలిపారు. ప్రపంచ దేశాల్లో మహిళల పట్ల వివక్ష ఉందన్నారు. విదేశాల్లో కష్టపడేవారికి గుర్తింపు ఉందని, ముందుకు వెళ్లేవారికి అవకాశం ఉందన్నారు. మన దగ్గర వివక్ష ఉందని, కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాలన్నారు.

మూసీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో జనాభా పెరుగుదల కనిపించలేదని, మేమిద్దరం.. మా కొక్కరు అనే పరిస్థితి ఉందన్నారు సీఎం. మేమిద్దరం.. మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే జనాభా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉందన్నారు. బుర్ర ఉన్న ఎవరైనా విగ్రహం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తారా? అంటూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు.

విగ్రహం ఖర్చు 70 కోట్లని, మొత్తమంతా కలిపితే రూ. 200 కోట్లు అవుతుందన్నారు. అంబేద్కర్ భవన్ కు 220 కోట్లు ఖర్చు చేశారని, సంతోషమని అన్నారు. మహాత్మాగాంధీ విజ్ఝాన కేంద్రానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేముందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

మూసీని ప్రక్షాళన చేయాలని అంటున్నారని, కానీ ప్రభుత్వం ఏమీ చేయకూడదని అంటున్నారు. దోమలు నియంత్రించాలన్నా, చెత్త తొలగించాలన్న డిమాండ్లు వచ్చినప్పుడు, ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇది ఎట్లా సాధ్యం అవుతుందో జర్నలిస్టులు సూచన చేయాలన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, అక్కడి నుంచి 10 వేల కుటుంబాలను తరలించారని అన్నారు. వారికి సరైన ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.

ALSO READ: కవిత.. మరో జయలలిత?

గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, అక్కడి నుంచి 10 వేల కుటుంబాలను తరలించారని అన్నారు. వారికి సరైన ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నదులను ప్రక్షాళన చేస్తున్నట్లు చెబుతున్నారని, హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన అవసరం లేదా? అంటూ ప్రత్యర్థులకు ప్రశ్నలు సంధించారు.

మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇటీవల ఓ అపార్టుమెంట్‌కి సంబంధించి చర్చ జరిగిందని, అందులో జర్నలిస్టు మిత్రులు ఉన్నారని అన్నారు. అది ఏడు ఏకరాల్లో మూసీ ఒడ్డున అపార్టుమెంట్ ఉందన్నారు. వారికి ఏడెకరాలకు సంబంధించి భూమి ప్రభుత్వం ఇస్తుందన్నారు. కొత్తగా నిర్మాణానికి సంబంధించి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తామన్నారు. మీరు సొసైటీగా ఏర్పడి కట్టించుకోవాలన్నారు. నష్టపరిహారం తీసుకుని వేరే దగ్గర కొనుగోలు చేస్తామంటే మీ ఇష్టమని అన్నారు. దాన్ని రాజకీయ రంగుగా మార్చి, అక్కడికి వెళ్లి వారిపట్ల సానుభూతి చూపిస్తున్నాయిని తెలిపారు. సానుభూతితో సమస్య పరిష్కారం కాదన్నారు.

 

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×