E-Paper
Advertisement

వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా ఇదిగో, సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా ఇదిగో, సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
Advertisement

Telangana assembly session-2026: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడి వేడిగా సాగుతున్నాయి. భూకబ్జాలు, ప్రభుత్వ విచారణలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం కూడా అదే సభలో అదే వేడి కంటిన్యూ అయ్యింది. ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్థం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా వ్యవహారాన్ని బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.

అసెంబ్లీలో హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జాలను బయటపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి 

Advertisement

ఆదివారం అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే భూకబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మహబూబ్ నగర్‌లో హరీష్‌రావు తమ్ముడు, మామ హనుమంత‌రావు, బామ్మర్ది సుమన్‌లు ధరణి‌ అడ్డు‌పెట్టుకుని ఓ ప్రైవేట్ కంపెనీని బెదిరించి వందల ఎకరాల భూమిని లాక్కుకున్నారని చెప్పారు. ఆయా భూములపై హరీష్‌రావు ఒకే చెబితే హౌస్ కమిటీ వేయిస్తామని వెల్లడించారు.

హరీష్‌రావు నిజాయితీ పరుడైతే ఆ భూముల మీద హౌస్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. ఇవాళ కేటీఆర్, హరీష్‌రావుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందన్నారు. ఇసుక, భూదందాలు చేసి వేల కోట్లకు అధిపతులు అయ్యారని అన్నారు. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే హరీష్‌రావుపై కేటీఆర్, సంతోష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

Advertisement

కాళేశ్వరం కేసు తర్వాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందన్న ముఖ్యమంత్రి

ధరణి పేరుతో బెదిరించి బాలానగర్‌లో వందల ఎకరాలను గుంజుకున్నారని అన్నారు. హరీష్‌రావు ఓకే అంటే ఆ భూముల మీద హౌస్ కమిటీ వేయిస్తామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్‌తోపాటు బీజేపీపై మాటల యుద్దాన్ని తీవ్రతరం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. బీజేపీ సూచనలు ఇవ్వడం అలవాటు‌గా మారిందన్నారు.

కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్, ఆయన కుటుంబాన్ని జైల్లో పెడతాం అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్,హరీష్‌రావులను జైల్లో పెడితే మీ సూచనలు స్వీకరిస్తామని కుండబద్దలు కొట్టేశారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడిందని దేశ ప్రధాని, హోం మంత్రి స్వయంగా చెప్పారని వివరించారు.

ALSO READ: కేటీఆర్ చేసిన పనికి ఆ రోజు మూసుకొని కూర్చున్న.. దానం ఆవేదన

వీళ్ల మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని అన్నారు. 48 గంటలు కాదు, ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారని అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టారని వెల్లడించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్‌ను జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందన్నారు.

 

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×