E-Paper
Advertisement

Cm Revanth : మంచి మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్..

Cm Revanth : మంచి మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్..
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా? అంటే అటు ప్రజలు ఇటు హై కమాండ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. కనీసం మంత్రిగా కూడా పనిచేయని ఆయనకు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. సీఎం అయ్యాక ఆయన పాలనా సరిగా చేయగలరా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ, వాటన్నింటినీ రేవంత్ రెడ్డి పటాపంచలు చేశారు.తనదైన మాటతీరు, విమర్శలకు కౌంటర్లు ఇస్తూ డైనమిక్ సీఎం అని పేరు సంపాదించుకున్నారు. గత ముఖ్యమంత్రి చేసిన పొరపాట్లకు తావులేకుండా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడంతో సీఎం రేవంత్ పాలనపై అందరికీ నమ్మకం వచ్చిందని స్పష్టం అవుతోంది.

ప్రజలను మెప్పించిన సీఎం..

గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే పార్టీలో కీలక నేతల మధ్య రేవంత్ రెడ్డి సయోధ్య కుదిర్చారు. సీనియర్లు, జూనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లారు.తనకు అడ్డొచ్చిన వారిని పట్టించుకోకుండా ఎన్నికల్లో ప్రాణంపెట్టి ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి పాత్ర మరువలేనిది. అందుకే కనీసం ఒక్కసారి కూడా మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా ఆయన మీద నమ్మకంతో హై కమాండ్ సీనియర్లను కాదని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. తనకు సీఎంగా చాన్స్ ఇచ్చిన హైమాండ్ నమ్మకాన్ని రేవంత్ రెడ్డి వమ్ము చేయలేదు. ఓవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షమంతో దగ్గర చేశారు. ఫలితంగా మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే నమ్మకాన్ని హైకమాండ్‌కు కలిగించారు. ప్రజలు సైతం రేవంత్ పాలనపై సంతోషంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

వరుస విజయాలతో బూస్ట్..

Advertisement

గతంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలిసేందుకు సైతం ఇష్టపడటం లేదని.. ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని టాక్ వినిపించింది. అయితే, అదంతా అవాస్తవమని తేలిపోయింది. ప్రస్తుతం రేవంత్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీలు సీఎం రేవంత్‌తో భేటీ అవుతున్నారు.ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతో పార్టీ పెద్దలకు సీఎం రేవంత్ పాలనపై నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఏఐసీసీ సమావేశంలో పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను మెచ్చుకున్నట్టు తెలిసింది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని రాహుల్, ఖర్గే సూచించినట్టు సమాచారం.

Urban Development: నిజామాబాద్ వేదికగా సర్కార్ మార్క్ పాలన.. హామీల అమలుపై మంత్రి పొన్నం ధీమా!

Advertisement

రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి మార్కులు పడ్డాయి. అందుకు ఆయన పాలనా తీరు,, ఎన్నికల సమయంలో మంత్రులకు బాధ్యతలు అప్పగించి నిరంతరం సమీక్ష చేయడం.. నాయకులకు క్లాస్ పీకడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పని విషయంలో కాంప్రమైజ్ కాబోనని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో పనితీరు సరిగా లేని మంత్రులకు స్థానచలనం తప్పదని హింట్ ఇచ్చారు. వారికి వచ్చే మార్కుల ఆధారంగానే మంత్రి పదవి ఉంటుందా? లేదా? అనేది డిసైడ్ చేస్తామని ప్రకటించారు. ఫలితంగా మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో బాగా కష్టపడంతో కాంగ్రెస్ సుమారు 100 వరకు మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను సొంతం చేసుకుంది.సర్పంచ్ ఎన్నికల్లోనూ తొలిస్థానంలో నిలిచింది. మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అటు ప్రజల్లో… ఇటు ఏఐసీసీ వద్ద మంచి మార్కులు కొట్టేశారని ప్రచారం జరుగుతోంది.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×