E-Paper

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. విద్యార్థులు, యువత రాక, ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..  విద్యార్థులు, యువత రాక,  ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

Hyderabad: దేశంలో ఎడ్యుకేషన్ విభాగం ప్రధానంగా దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. మెట్రోపాలిటన్ సిటీలతోపాలు టైర్ -2 నగరాల్లో ఆందోళలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం శాంతియుత నిరసనలు చేపట్టింది.

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

హైదరాబాద్‌లో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. ఇంటర్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ యువకులు, విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పోరాటంలో మీకు నేను అండగా ఉంటానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే హక్కు ఉండాలన్నారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛ ప్రాముఖ్యతను వాంగ్‌చుక్ మరింత నొక్కి చెప్పారు. దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా మాట్లాడే హక్కును ఇవ్వాలన్నారు.

విద్యార్థులు, యువత రాక, ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

లేకుంటే నిరంకుశ రాజ్యంగా ప్రకటించాలన్నారు. దేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, పెరుగుతున్న విద్యా వ్యయాలపై పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఓ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అవకాశాలు లభించాలన్నారు.

నిరసనలో పాల్గొన్నారు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. పేపర్ లీక్ స్కామ్ బాధ్యులైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేస్తే సరిపోదన్నారు. అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినందుకు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో.. మహిళలు సాధించిన విజయాలివే..?

ఒక్క ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించలేని నాయకులు, లంచ గొండితనం, పేపర్ లీకులతో విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. సంపద ఎటు పోతోందంటూ పలు ప్రశ్నలు సంధించారు. డిగ్రీ చదివిన వారిలో 6 శాతం మందికి స్కిల్స్ ఉంటే, 94 శాతం విద్యార్థుల భవిష్యత్ ఏంటని నిలదీశారు.

జూన్ 11-20 వరకు దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు, టైర్-2 సిటీల్లో శాంతియుత నిరసనలు చేపట్టింది కాక్రోచ్ జనతాపార్టీ. జూన్ 20న జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసనకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి ఢిల్లీ ప్రభుత్వం నిరసనకు అనుమతి ఇస్తుందా? అన్నదే అసలు ప్రశ్న.

 

Related News

Women Empowerment: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో.. మహిళలు సాధించిన విజయాలివే..?

Free Breakfast: రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త స్కీమ్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

GHMC Vehicles: జీహెచ్ఎంసీలో బిగ్ స్కామ్.. బైక్ నెంబర్లతో కారు బిల్లులు క్లెయిమ్..!

Healthcare Jobs: నెలకు రూ 3 లక్షల జీతం.. జర్మనీ, కువైట్‌లో తెలంగాణ నర్సులకు బంపర్ డిమాండ్!

Rainwater: మణికొండలో అపార్ట్‌మెంట్ వాసుల అద్భుతం.. జలమండలి ప్రశంసల జల్లు..!

Hyderabad Weather: హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం.. ఒకే రోజులో రెండు సీజన్లు..!

Telangana Tourism: ప్రజాపాలనలో పర్యాటక రంగానికి కొత్త ఊపు.. పెరిగిన పర్యాటకులు

×