E-Paper
Advertisement

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?
Advertisement

Rashmika mandanna:టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు తమ సినిమాల షూటింగ్ సమయంలో గాయపడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. ఇప్పుడు నేషనల్ రష్మిక మందన్న (Rashmika mandanna) కూడా గాయపడ్డారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమె మైసా , రణబాలి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

షూటింగ్ సెట్లో గాయపడ్డ రష్మిక..

అటు ఈ రెండు చిత్రాలలో వరసగా యాక్షన్ సీక్వెన్స్లు, డాన్స్ పెర్ఫార్మెన్స్లు చేయడం వల్ల రష్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్మెంట్ అయింది. ఆమె గాయం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట . తీవ్రంగా సాధన చేసే క్రీడాకారులలో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

also read:కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

వైద్యులు ఏమన్నారంటే..

ప్రస్తుతం ఆమె గాయాన్ని పరిశీలించిన వైద్యులు చికిత్స అనంతరం ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరమని వైద్యులు తెలిపారు.

4 సినిమాలు.. 30 ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్..

Advertisement

ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో అత్యంత బిజియెస్ట్ హీరోయిన్గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 4 భారీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే 30 ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్మికకు జరిగిన ఈ తీవ్ర గాయంతో ఆయా సినిమాలు, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని, శ్రేయోభిలాషులు అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్ లో సెలబ్రిటీలను వెంటాడుతున్న గాయాలు..

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలను గాయాలు వెంటాడుతున్నాయి అని చెప్పాలి. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు షూటింగ్లో గాయపడుతూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ (Ram Charan) గాయపడగా .. ఇటీవల ఆయన చేతి మణికట్టుకు కోయంబత్తూర్ లోని గంగా హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా షూటింగ్ కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా కాలు జారిపడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 8 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొరియన్ కనకరాజు సినిమా ఆడియో లాంచ్ లో భాగంగా వరుణ్ తేజ్ కూడా చేతి కర్రతో కనిపించి అభిమానులను కంగారుపెట్టారు.

Related News

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆరంభం!

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

రామాయణ ట్రైలర్ లో సాయి పల్లవి పాత్రనే డామినేట్ చేసిన శ్రుతకీర్తి ఎవరో తెలుసా?

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

Big Stories

Advertisement
×