E-Paper
Advertisement

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!
Advertisement

Surekha Vani:తెలుగు బుల్లితెర నుంచి వెండితెర వరకు తల్లిగా, అక్కగా, వదినగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి సురేఖావాణి (Surekha Vani) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన కూతురు సుప్రీత(Supritha) తో కలిసి సందడి చేసే ఈ సీనియర్ నటి తాజాగా ‘నీరమ్’ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ మరియు తన కెరీర్‌పై ఓపెన్‌గా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండో పెళ్లిపై క్లారిటీ:

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సురేఖావాణి రెండో పెళ్లి గురించి విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. “నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదు, ఇకముందు కూడా ఉండదు. ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. నా కూతురు సుప్రీతకే పెళ్లి వయసు వచ్చింది, ఇక నాకేంటి పెళ్లి?” అని నవ్వుతూ రూమర్లకు చెక్ పెట్టారు.కనీసం భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని అడగగా.. అయినా మీడియా వాళ్ళు నా పెళ్లి ఎప్పుడో చేసేసారు..రాసేశారు కూడా అంటూ నవ్వుతూ తెలిపింది సురేఖ వాణి.

Advertisement

also read:రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

కూతురి కెరీర్, కథల ఎంపిక:

తన కూతురు సుప్రీత సినీ అరంగేట్రంపై మాట్లాడుతూ.. కథల ఎంపికలో నిర్ణయం తన కూతురిదేనని స్పష్టం చేశారు. “నేను కేవలం సలహా మాత్రమే ఇస్తాను, నచ్చకపోతే వద్దని చెప్తాను, అంతిమ నిర్ణయం తనదే. ఇక త్వరలోనే రాబోయే తన మొదటి సినిమాలో నేను కూడా ఓ డాక్టర్ క్యారెక్టర్‌లో ఆమెతో కలిసి నటించాను” అని సురేఖావాణి పంచుకున్నారు.

అవకాశాల కోసం విజ్ఞప్తి:

Advertisement

సినిమాలకు దూరమయ్యారనే ప్రచారంపై స్పందిస్తూ, తాను నటనకు ఎప్పుడూ దూరంగా లేనని చెప్పారు. “నాకు మంచి మంచి అవకాశాలు ఇవ్వమని దయచేసి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు గట్టిగా చెప్పండి” అంటూ సరదాగా ప్రెస్ మీట్‌లో కోరారు. మంచి రోల్స్ వస్తే సినిమాలు చేయడానికైనా లేదా ఓటీటీ, టీవీల్లో నటించడానికైనా తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

ట్రోలింగ్స్‌ను పట్టించుకోను:

సోషల్ మీడియాలో తమపై వచ్చే నెగిటివ్ కామెంట్లు, నెగిటివిటీ గురించి పెద్దగా పట్టించుకోనని సురేఖావాణి తేల్చి చెప్పారు. ఇక తన కూతురు సుప్రీత సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్‌గా, ఉడుకు రక్తంతో స్పందిస్తుంటుందని, అందుకే తనలో ఆ అగ్రెషన్ కొద్దిగా తగ్గిందని సరదాగా వ్యాఖ్యానించారు.

రెండో పెళ్లి పుకార్లకు చెక్ పెడుతూ సురేఖావాణి ఇచ్చిన ఈ క్లారిటీతో రూమర్లన్నింటికీ తెరపడింది. ఒకవైపు కూతురి భవిష్యత్తుపై దృష్టి పెడుతూనే, మరోవైపు నటిగా మంచి అవకాశాల కోసం చూస్తున్న సురేఖావాణిని త్వరలోనే వెండితెరపై మరిన్ని మంచి పాత్రల్లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆరంభం!

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

రామాయణ ట్రైలర్ లో సాయి పల్లవి పాత్రనే డామినేట్ చేసిన శ్రుతకీర్తి ఎవరో తెలుసా?

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

Big Stories

Advertisement
×