E-Paper
Advertisement

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు తీపి కబురు. నెలకు రూ. 1000 చొప్పున ఏడాదిపాటు రానుంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం. దానికి మీరు చేయాల్సింది ఒక్కటే చిన్న టెస్టు రాస్తే చాలు. నెలకు వెయ్యిరూపాయలు దక్కించుకోవచ్చు.

మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-NMMS- తెలంగాణ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-NMMS 2026-27 ప్రకటన విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి 9 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా స్కాలర్ షిప్ అందిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12 వేలు అందించనుంది. తొమ్మిదో తరగతిలో అప్లై చేసుకుంటే ఇంటర్ వరకు అంటే నాలుగేళ్ల పాటు స్కాలర్ షిప్ లభిస్తుంది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 24 లోగా దరఖాస్తు సమర్పించారు.

Advertisement

స్కాలర్ షిప్‌కు ఎవరు అర్హులు- 2025-26 ఏడాదిలో విద్యార్థులు ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. వారు మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులై ఉండాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో విద్యార్థులు చదివినవారు మాత్రమే. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించరాదు. స్కాలర్‌షిప్‌ కోసం రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది, అయితే నెగెటివ్ మార్క్ లేదు. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 90 మల్టిపుల్ ప్రశ్నలు ఉంటాయి. 7, 8 క్లాసులకు సంబంధించి సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

పరీక్ష ఫీజు ఎంత? రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌‌ ద్వారా విద్యార్థుల దరఖాస్తులను ఆయా పాఠశాలలకు సమర్పించాలి. అలాగే ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 కట్టాలి. ఇక ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 మాత్రమే. ఎస్‌బీఐ చలానా జత చేయాల్సి వుంటుంది. అయితే దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఆగష్టు 24 వరకు మాత్రమే.

Advertisement

పరీక్ష ఎప్పుడు? దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసిన అప్లికేషన్లు, ఫీజు రశీదులను డీఈఓ ఆఫీసులో సమర్పించడానికి చివరి తేదీ ఆగష్టు ఒకటి వరకు మాత్రమే. డీఈఓ ఆఫీస్ నుంచి హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆఫీస్‌కు సమర్పించడానికి చివరి తేదీ ఆగష్టు 7 వరకు ఉంది. ఇక పరీక్ష నవంబర్ ఒకటిన జరగనుంది. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది.

ALSO READ: నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

ముఖ్య గమనిక-గురుకులాలు/రెసిడెన్షియల్ పాఠశాలలు, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు దీనికి అర్హులు కారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలను సంప్రదించగలరు.

Related News

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×