E-Paper
Advertisement

Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన

Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన
Advertisement

Collector Haimavathi:  మాత శిశు ఆరోగ్య కేంద్రం లో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భవతులకు మెరుగైన సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి (Collector Haimavathi) ఆదేశించారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద గర్భిణీ స్త్రీలకు మంచి వైద్యం అందించడం కోసం ఆసుపత్రి భవనం తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనీ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది ప్రతి ఒక్కరు గర్భిణీలకు ఓపికగా వైద్యం చెయ్యాలని ఆదేశించారు.

Also Read: Dreame L40 Ultra AE: మీ క్లీనింగ్ కష్టాలన్నీ తీరిపోతాయ్.. మీ మాట వినే Dreame రోబోట్ వచ్చేసింది !

 పిల్లలకు టీకా లను సక్రమంగా అందించాలి 

Advertisement

ఆసుపత్రి లోపల అన్ని వార్డులు కలియ తిరిగారు. అప్పుడే పుట్టిన పిల్లలకు టీకా లను సక్రమంగా అందించాలని వార్డులలో గర్భిణీ స్త్రీ, పుట్టిన బిడ్డలకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలలో మనో ధైర్యం నింపుతూ మంచి ఆహారపు నియమాలు, సహజ ప్రసవాలు జరిగేలా యోగ లాంటి కొన్ని యాక్టివిటీస్ తెలుపాలని డాక్టర్ లకు సూచించారు. సహజ ప్రసవాలు పెంచాలని తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే ఆపరేషన్ చెయ్యాలని తెలిపారు. ఆసుపత్రిలో కొంత మంది డాక్టర్లు ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని వారి పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డాక్టర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు పై అధికారి అనుమతి లేనిదే సెలవు తీసుకోవద్దని తప్పనిసరిగా ఆసుపత్రిలో లీవ్ లెటర్ పెట్టాలని తెలిపారు.

Also Read: Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×