E-Paper
Advertisement

Congress Election Campaign : బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు.. రేపటితో ప్రచారానికి తెర

Congress Election Campaign : బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు.. రేపటితో ప్రచారానికి తెర
Advertisement
telangana election live updates

Congress Election Campaign(Telangana election live updates):

తెలంగాణ ఎన్నికల సమరంలో కేసీఆర్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలే అస్త్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. ధరణితో వేల ఎకరాలు స్వాహా చేశారని ఆరోపిస్తోంది కాంగ్రెస్‌. తాము అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని వార్నింగ్‌ ఇస్తోంది.

ఎన్నికల కురుక్షేత్రంలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం రేపటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. వరుసగా క్యూకట్టి మరీ నియోజకవర్గాల ఎన్నిక ప్రచారంలో జోరు పెంచాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విజయభేరీ సభలతో కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే తాము రాష్ట్ర ప్రజలకు ఏం చెస్తామో చెబుతూనే.. కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్నారు.

Advertisement

ఇక ఇటీవలే మేడిగడ్డ కుంగుబాటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారడంతో.. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది కాబట్టి నాణ్యత లోపించిందని మండిపడుతున్నారు రాహుల్‌, రేవంత్‌రెడ్డిలు. అలాగే ధరణి ముసుగులో భూకుంభకోణం జరిగిందని.. హైదరాబాద్‌ చుట్టూ భూములను కేసీఆర్‌ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు టీపీసీసీ చీఫ్‌. తాము అధికారంలోకి రాగానే గులాబీ నేతల అవినీతిని బట్టబయలు చేసి.. తిన్నదంతా కక్కిస్తామని.. చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు డబుల్‌ బెడ్‌ రూం కట్టిస్తామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్‌. ఇక ఇదే తీరుగా రాహుల్ గాంధీ కూడా కేసీఆర్‌ అవినీతి సొమ్మంతా వసూలు చేసి ప్రజలకు పంచుతానని విమర్శలు గుప్పిస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×