BigTV English

Congress MLA On Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు అనుమతించక పోతే.. తిప్పలు తప్పవు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

Congress MLA On Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు అనుమతించక పోతే.. తిప్పలు తప్పవు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

తిరుపతి దర్శనాలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
కృష్ణా, గోదావరి జలాలు కావాలి కానీ
మా రికమెండ్ లేఖలకు విలువివ్వరా?
చంద్రబాబు స్పందించాలి
లేదంటే మా స్పందన వేరేలా ఉంటుంది
119 మంది ఎమ్మెల్యేల ఆవేదన ఇది
ఇప్పటికైనా మాకు విలువ ఇవ్వాలి
లేకుంటే మీకు తిప్పలు తప్పవు


మహబూబ్ నగర్, స్వేచ్ఛ:
Congress MLA On Tirumala: తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను అనుమతించకపోతే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి , తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం మహబూబ్ నగర్ లో జరిగిన ముడా ఛైర్మన్ లక్హ్మణ్ యాదవ్ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడారు. ‘ఏపీకి కృష్ణా జలాలు తెలంగాణ నుంచే రావాలి. మా జలాలను యథేచ్ఛగా వాడుకుంటున్న మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికికి మ రికమెండ్ లేఖలు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. అవసరమైతే చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మా లేఖలను అనుమతించకపోతే ఏపీ ప్రభుత్వానికి తిప్పలు తప్పవని అన్నారు. అలా అయితే తెలంగాణకు చంద్రబాబు రావలసిన అవసరం లేదు అని కామెంట్ చేశారు. తమ సిఫారసు లేఖలతో తెలంగాణ ప్రజలకు వెంకన్న దర్శనం ఇప్పించలేకపోవడం బాధాకరమన్నారు. ఇది తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల ఆవేదన అని.. అసెంబ్లీ సమావేశాలలో దీన్ని సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లి, ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు.

Also Read: Mahesh Kumar on KTR: జస్ట్ రెండు రోజుల్లో అంతా సెట్.. కేటీఆర్ నీకు ఇది తగునా.. ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకో.. పీసీసీ చీఫ్ మహేష్


అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
గత రెండు రోజుల క్రితం ఇదే విషయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెంకన్న స్వామి దర్శనానంతరం మనసులో మాటను బయటపెట్టారు.మాలాగే అక్కడికి వెళ్లిన మా కార్యకర్తలకు కూడా రూములు , దేవుడి దర్శనం సజావుగా జరిగేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి… ఇది మా ఒక్కరి మాట కాదు రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాట…. మా అందరి ఎమ్మెల్యేల మనసులోని మాటనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బయటకి చెప్పాడు….టిఆర్ఎస్ పాలనలో జరిగింది మళ్లీ రిపీట్ కానివ్వం…
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని అందరూ ఎమ్మెల్యేలను కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తతామని అన్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×