Jaggareddy On Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. నేతల మధ్య మాటలు వ్యక్తిగతానికి దారి తీస్తున్నాయి. లేటెస్ట్‌గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ మీద రుసరుసలాడారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీది బ్రహ్మణ కులమని, ఆయనది హిందూ మతమన్నారు. సోనియాగాంధీ క్రైస్తవురాలు అని బండి మాట్లాడారు. హిందూ ధర్మ ప్రకారం భర్త కులమే భార్యకు వర్తిస్తుందని, ఈ చిన్న లాజిక్ ను కేంద్రమంత్రి ఎలా మిస్సయ్యారని ప్రస్తావించారు.
ఆదివారం ఉదయం గాంధీభవన్‌లో మీడియా ముందుకొచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అసలు గాంధీలపై బండి సంజయ్‌కు తెలిసి మాట్లాడారా? తెలియక మాట్లాడారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. స్వాతంత్ర సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారిదని, రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర అని అన్నారు.
రాహుల్‌గాంధీ కుటుంబం బ్రాహ్మణులని అన్నారు జగ్గారెడ్డి. బ్రాహ్మణులు.. హిందువులు కారా? అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. బండి సంజయ్ లాంటి వాళ్ళకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్పారు. మీకేమైనా డౌట్ ఉందా? అంటూ ప్రశ్న లేవనెత్తారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదని, సోనియా గాంధీ ఏ మతమని బండి సంజయ్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. ఇదే క్రమంలో తన ఫ్యామిలీ గురించి వివరించారు.
సోనియా గాంధీ భర్త రాజీవ్ బ్రాహ్మణుడని, హిందూ ధర్మ ప్రకారం సోనియా గాంధీ బ్రాహ్మణ కుటుంబమే అవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. ఈ విషయంలో ఆయన మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌కు ఉద్యమ కాలంలో ఆయన పేరుంది. ఫిరోజ్ గాండీ పేరు కాలక్రమేణా గాంధీగా ప్రజలు మార్చారని గుర్తు చేశారు.
ALSO READ: వరంగల్‌లో కిషన్‌రెడ్డి ప్రచారం.. గెలుపు మాదేనంటూ ధీమా
మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ జంధ్యం వేసుకునే వాళ్లని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే ఆయన కూడా జంధ్యం వేసుకుంటారని వివరించారు. మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ సిక్కు అని, సంజయ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక మేనకా గాంధీగా మార్చుకున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ స్వతంత్ర ఉద్యమకారుడని, స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళారని గుర్తు చేశారు. ఫిరోజ్ హిందూ మతంలోకి మారి ఇందిరాను పెళ్లి చేసుకున్నారని తెలియజేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.
బండి సంజయ్ కు జగ్గా రెడ్డి కౌంటర్
గాంధీలపై బండి సంజయ్ తెలిసి మాట్లాడారా? తెలీయ మాట్లాడారా?
స్వాతంత్ర్య సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారిది
రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర
రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణులు
బ్రాహ్మణులు హిందువులు కారా?
– జగ్గారెడ్డి pic.twitter.com/ma3hpWVhsI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025