Mastan Sai:గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రేయసి లావణ్య (Lavanya).. మస్తాన్ సాయి (Mastan Sai) అనే వ్యక్తికి సంబంధించిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించి, అతడిని అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ కి తనను అలవాటు చేసి, తన ప్రైవేట్ వీడియోలు తీసాడని, ఇక తన వీడియోని డిలీట్ చేద్దామని చూస్తే, అందులో 300 మంది అమ్మాయిలా ప్రైవేటు వీడియోలు ఉన్నాయి.. తనకు ఏమైనా పర్లేదు కానీ ఆ అమ్మాయిలు జీవితాలను కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. ఇక అలాగే లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి మస్తాన్ సాయి , ఆర్జే శేఖర్ బాషా(RJ Shakar basha) పన్నాగం పన్నారని, అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఆడియోని కూడా పోలీసులకు అందించింది. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్జే శేఖర్ బాషాపై కూడా కేసు ఫైల్ అయింది.
మా ఇంట్లోకి దొంగగా వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళింది..
ఇక అందరూ మస్తాన్ సాయిదే తప్పు.. ఆయన అలాంటి వాడేమో అంటూ తప్పు పడుతున్న నేపథ్యంలో అటు పలు మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్న క్రమంలో మస్తాన్ సాయి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఎక్స్ క్లూజివ్ గా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య గుట్టు రట్టు చేశారు. వీడియోలతో సహా బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏది నిజం? ఏది నమ్మాలి? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి పేరెంట్స్ మాట్లాడుతూ.. “లావణ్య మా కొడుకు మస్తాన్ సాయిని ఇరికించి మరీ కేసు పెట్టింది. 2023 నుంచే అటు సాయిని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది.. ఇక మేము దర్గా లో ఉన్న సమయంలో మా ఇంట్లోకి వచ్చి దొంగతనంగా హార్డ్ డిస్క్ తీసుకెళ్ళింది. సాధారణంగా ఒకరి ఇంటిలోకి వెళ్ళాలి అంటే.. ఎంత కరుడుగట్టిన దొంగలైనా సరే భయపడతారు. కానీ ఈమె మాత్రం దర్జాగా మేము ఇంట్లో లేమని తెలుసుకొని మరీ పోలీసుల సహాయంతో దొంగతనం చేసింది. ఎంత దర్జాగా మా ఇంట్లో నుంచి ఆ హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్తుందో మీరే చూడండి” అంటూ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చూపించారు మస్తాన్ సాయి తండ్రి.
గత రెండేళ్లుగా చిత్రవధకు గురిచేస్తోంది – మస్తాన్ సాయి పేరెంట్స్
అలాగే ఆయన మాట్లాడుతూ.. “నాకు పోలీసుల అండ ఉంది.. మీరేం చేయలేరు.. నేను చెప్పిందే మీడియా రాస్తుంది అంటూ మమ్మల్ని బెదిరించింది. గుంటూరులో కూడా మాపై తప్పుడు కేసులు పెట్టింది. 30వ తారీఖు మస్తాన్ సాయిని లావణ్య తన ఇంటికి తీసుకెళ్ళి, రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆ తర్వాతే సాయి పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మొదట్లో మమ్మల్ని రూ.8కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన ఆమె, ఇప్పుడు మళ్లీ రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోంది. అర్ధరాత్రి 1,2 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. ఆమె డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంది. అనేకమంది జీవితాలతో కూడా ఆడుకుంది. మా కొడుకు హార్డ్ డిస్క్లో తన భార్య గర్ల్ ఫ్రెండ్ వీడియోలు తప్పా.. వేరే అమ్మాయిల వీడియోలు లేవు.
ఆమె మాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. మొదట మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే కొద్ది రోజులు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. ఆ తర్వాత మస్తాన్ సాయికి పెళ్లి అయిందని తెలుసుకొని ,డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. నేను చెప్పిన విధంగా మీడియా వార్తలు వేస్తోంది అంటూ మమ్మల్ని మానసికంగా చిత్రవధకు గురి చేసింది. లావణ్య బెదిరింపులు తట్టుకోలేక మస్తాన్ సాయి తల్లి రూ.30 లక్షలు ఇచ్చింది. పోలీసులు, న్యాయస్థానం మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. రెండు సంవత్సరాలుగా మమ్మల్ని చిత్రవధకు గురిచేస్తోంది ఆమెను మాత్రం అసలు నమ్మకండి” అంటూ మస్తాన్ సాయి తల్లిదండ్రులు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.