Bhairavam Movie: ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడున్న తెలుగు ఆడియన్స్ కి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. పెద్ద చిన్న అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ఎంకరేజ్ చేస్తారు ప్రేక్షకులు. ఇకపోతే ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత కాలంలో అలా సినిమాలు రావడం తగ్గిపోయింది. హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మళ్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కలిసి నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
అలానే చాలామంది యంగ్ హీరోస్ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు రాబోతున్న మల్టీస్టారర్ సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ వీళ్ళు ముగ్గురు కలిసి భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా పై ప్రేక్షకులకు ఒక స్థాయి అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ నారా రోహిత్ మంచు మనోజ్ సినిమాలు రీసెంట్ టైమ్స్ లో బాగా తగ్గించేశారు. ఒకప్పుడు కేవలం కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేస్తూ మంచి పేరును సాధించుకున్న నారా రోహిత్ తర్వాత కాలంలో సినిమాల ఆపేశారు. నారా రోహిత్ సినిమాలపై చాలామంది ప్రేక్షకులకు మంచి నమ్మకం ఉంది. నారా రోహిత్ కథను ఓకే చేశాడు అంటే ఖచ్చితంగా మంచి పాయింట్ ఉంటుంది అని చాలామందికి ఒక నమ్మకం. మంచు మనోజ్ కూడా సినిమాలు చేసి చాలా రోజులు అయింది.
Also Read : Ravi Teja: రవితేజకు కథలను వినిపించిన ఇద్దరు యంగ్ దర్శకులు, ఒకటి ఆల్మోస్ట్ లాక్ అయినట్లే
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన డేట్ కూడా ఫైనల్ అయిపోయినట్లే. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లరి నరేష్ హీరోగా నాంది, ఉగ్రం వంటి సినిమాలు తీసిన విజయ్ కనకమేడల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ఇద్దరు హీరోలకు మంచి కం బ్యాక్ అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అని అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు వేచి చూడకు తప్పదు.
Also Read : Chandoo Mondeti : కంఫర్ట్ జోన్ వదిలేసి, పెద్ద ప్రాజెక్ట్ పట్టాడు