E-Paper
Advertisement

Mahesh Kumar Gaud: నెలఖారులోగా కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Gaud: నెలఖారులోగా కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Gaud: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. గ్లోబల్ సమ్మిట్ విజయంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్‌పై ఆరోపణలు.. ఈ అంశాలపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి.

నిజమైన తల్లి సోనియా గాంధీ-మహేష్ కుమార్గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున విజయవంతమైందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్ధికంగా విధ్వంసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే, బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని సాధించిందని ఆయన అన్నారు.

Advertisement

నెలాఖరులోపు కార్పొరేషన్‌ ఛైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. నూతన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‍లు, ప్రచార కమిటీలు వస్తాయన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యేగా తాన పోటీ హై కమాండ్ నిర్ణయం అన్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ పదవిలో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం కేటాయిస్తామన్నారు.

ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే.. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు ఇక అధికారం దక్కదని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు మహేష్ కుమార్. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహాలను ఎవరూ తీయలేరని, గతంలో అధికారంలో ఉన్నవారు పెట్టలేకపోయినా, తాము వాటిని ప్రతిష్టించామని తెలిపారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు మహేష్ కుమార్ గౌడ్.

Advertisement

Also Read: నన్ను టార్గెట్ చేస్తావా! లెక్కలతో నీ చిట్టా బయటపెడతా! కృష్ణరావుపై కవిత ఫైర్

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కాంగ్రెస్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టడంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి కఠినమైన స్పందన రావడానికి అవకాశం ఉంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉష్ణోగ్రతను మరింత పెంచే అవకాశముంది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×