E-Paper
Advertisement

Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. అంతర్జాతీయ మాఫియా లింకులు.. నేడు కస్టడీపై కోర్టు నిర్ణయం!

Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. అంతర్జాతీయ మాఫియా లింకులు.. నేడు కస్టడీపై కోర్టు నిర్ణయం!
Advertisement

Drug Case: మొయినాబాద్ ఫాం హౌస్‌ వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల దందాలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఫాం హౌస్‌లో ఇప్పటివరకు దాదాపు 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, ఇతర ఫాం హౌస్‌లలో కూడా విస్తరించి ఉన్నట్లు సిట్ (SIT) అనుమానిస్తోంది. దీంతో హైదరాబాద్ శివారులోని అనుమానిత ప్రాంతాలన్నింటిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

రాజకీయ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు
ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డికి, డ్రగ్స్ సరఫరాదారు అభిషేక్ సింగ్ ఏకంగా 24 సార్లు మత్తు పదార్థాలను అందించినట్లు విచారణలో తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తుండగా, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ రంగంలోని పెద్దల పేర్లు తెరపైకి వస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీల్లో పాల్గొన్న ఆ ‘ప్రముఖులు’ ఎవరనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

Advertisement

అంతర్జాతీయ మాఫియా కోణం
ఈ కేసులో కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పెద్ద ఎత్తున ‘మాఫియా’ కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన నమిత్ శర్మను ‘షార్ప్ షూటర్‌’గా గుర్తించడం విచారణాధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇతనికి ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. మత్తు పదార్థాల సరఫరా వెనుక భారీ నెట్‌వర్క్ పనిచేస్తోందని సిట్ గట్టిగా నమ్ముతోంది.

నిందితుల విచారణే కీలకం
రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను లోతుగా విచారిస్తే, ఈ మత్తు దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పెట్టుబడిదారులు, వినియోగదారుల చిట్టా బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా నమిత్ శర్మ నేపథ్యం, అభిషేక్ సింగ్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదిస్తే మరిన్ని సంచలన నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.

Advertisement

Also Read: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

నేడు వెలువడనున్న కోర్టు తీర్పు
నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది. పోలీసు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కేసులో తదుపరి అరెస్టులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మాఫియా లింకులు, షూటర్ల ప్రమేయం వంటి అంశాల నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×