Big Stories

CPM leaders met CM Revanth: అందుకేనా సమావేశం, అంతా

CPM leaders met CM Revanth:  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీల ఎత్తులు పైఎత్తులు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ సీపీఎం నేతలు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య వంటి ముఖ్యమంత్రి నివాసంలో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.

- Advertisement -

ఎన్నికల వేళ మద్దతు, అవలంభించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన సీపీఎంకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈసారి అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా శనివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

- Advertisement -

భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందేందుకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా వారం కిందట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ‌కూ పరస్పరం సహకరించుకోవాలని నేతలు భావించారు. సీపీఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూనం సాంబశివరావు గెలుపొందారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News