Big Stories

Priyadarshini Raje Scindia got angry at women: ‘నీటి సమస్య వల్ల మా ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు’

Priyadarshini Raje Scindia got angry at women: తమ ఊరికి రోడ్డు లేదనో లేదా రవాణా సౌకర్యం లేదనో తమ ఊరులో ఉన్న యువకులకు పిల్లనివ్వడంలేదనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కానీ, ఆ ఊరిలో నీటి సమస్య ఉందని ఊళ్లో యవకులకు పెళ్లిళ్లు కావడంలేదని ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ గ్రామస్తులంతా కలిసి ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే, తన భర్తకు ఓటు వేసి గెలిపించాలని తమ ఊరికి వచ్చిన కేంద్రమంత్రి భార్యను వారంతా కలిసి కేవలం ఈ సమస్యను పరిష్కారించాలని కోరారు. తమ ఊరిలో నీటి సమస్య ఉంది.. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలో సమస్య గురించి తనకు రాసివ్వండంటూ కోరింది. మీరే రాసుకోండి మేడం అంటూ ఓ మహిళా బదులిచ్చింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లోని గుణ శివపురి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే, ఆయన సతీమణి ప్రియదర్శినీ రాజే సింధియా తన భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఖుజ్రీ గ్రామానికి వెళ్లి తన భర్తకు ఓటు వేయాలని ఓటర్లను కోరింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్య వల్ల తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని, అదేవిధంగా తమ గ్రామంలోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడంలేదంటూ వాపోయారు. వెంటనే ప్రియదర్శినీ రాజే మాట్లాడుతూ ఆ సమస్యల గురించి తనకు ఓ పేపర్ పై రాసివ్వాలని చెప్పింది. వెంటనే ఓ మహిళ స్పందించి ‘మేడం మీరే రాసుకోండి’ అని కోరింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ‘మీరు మీ గ్రామంలోని సమస్యలు రాసివ్వండి.. అంతేకానీ, మీ పని చేయడం నా పని కాదు’ అని అన్నారు. ఆ వెంటనే మరో మహిళ మాట్లాడుతూ మేడం ఇటు వైపు చూడండి.. ఇక్కడ నీటి ట్యాంక్ ఉంది కానీ, అందులో నీరు ఉండదు అంటూ ప్రియదర్శినీతో వేడుకుంది. అయినా ఆమె సీరియస్ అవుతూ ముందుకెళ్లారు.

- Advertisement -

Also Read: ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటర్లు తమ సమస్య గురించి వివరించి, ఆ సమస్యను పరిష్కారించాలని కోరుతుంటే అలా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News