E-Paper
Advertisement

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..
Advertisement

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×