E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!

హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!
Advertisement

Cyberabad Moves: ఒక వాహనంలో ఒక్కరే ప్రయాణించే పద్ధతికి స్వస్తి చెప్పి వాహనాలను పంచుకొని ప్రయాణించే ఉమ్మడి విధానాన్ని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా జరగనున్న మూడు రోజుల ‘సైబరాబాద్ మూవ్స్ 2026’పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబరాబాద్‌లో నివసించేవారు, ఇక్కడ విధులు నిర్వర్తించేవారు, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవారు ‘మేము సైతం’ అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని “హాయ్ బోలో, దిల్ ఖోలో, నో సోలో, సాథ్ చలో” అని పిలుపునిచ్చారు.

ఐదు సీట్ల కారులో..

ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతున్న సమస్య అని పేర్కొంటూ దీని పరిష్కారంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం, బాధ్యత కీలకమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనంపై వచ్చేవారు మరొకరిని వెంట తీసుకురావాలని, ఐదు సీట్ల కారులో ఒక్కరే ప్రయాణించకుండా కనీసం మరొకరితో కలిసి రావాలని సూచించారు. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే తల్లిదండ్రులు పునరాలోచించాలని కోరారు. సైకిళ్లపై వచ్చేవారికి ప్రత్యేక మార్గం, సురక్షిత ప్రయాణంతోపాటు కోరిన సమయంలో ఆటంకం లేని రాకపోకలకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. పోలీసుల వద్ద ఉన్న సమాచారం, సీసీ కెమెరాలు, వాహన గణన యంత్రాల ద్వారా ప్రతి వీధిలో గతంలో ఉన్న రద్దీని ఈ మూడు రోజులతో పోల్చి, రద్దీ లేని రహదారులను ప్రత్యక్షంగా చూపిస్తామని వెల్లడించారు.

ట్రాఫిక్​ జాం..

Advertisement

జేఎన్టీయూ నుంచి ఐకియా ఐటీ కారిడార్ వైపు వచ్చేవారిలో దాదాపు 65శాతం మంది అదే ప్రాంతం నుంచి గంట, గంటన్నర వ్యవధిలోనే చేరుకుంటుండటంతో ట్రాఫిక్​ జాం అవుతోందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆర్టీసీ సహకారంతో అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. గత నెల రోజులుగా నివాసితుల సంక్షేమ సంఘాలు, ఐటీ సంస్థలు, ఆస్పత్రులు, ఇతర భాగస్వామ్య వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపామన్నారు. ఫీనిక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు ఉద్యోగుల్లో కారు పూలింగ్‌ ను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించేందుకు ముందుకొచ్చాయని వివరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏ ఈ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు.

పరిష్కార మార్గాలు..

శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం సాధారణ సూచనలకే పరిమితం కాకుండా ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో పరిష్కారాలను అన్వేషించాలని తెలిపారు. ఐటీ సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలతో నిర్వహించిన చర్చల్లో పలు ఆచరణాత్మక సూచనలు వచ్చాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను పంచుకుంటూ సమాజ స్థాయిలో ట్రాఫిక్ క్రమశిక్షణ, పౌర బాధ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ.. సీపీ చొరవతో చేపట్టిన ‘ట్రాఫిక్ టాక్స్’ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.

ట్రాఫిక్‌ను సృష్టించేది మనమే..

Advertisement

ఈ మూడు రోజులు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. టీ-హబ్‌లో ఐటీ సంస్థలు, పాఠశాలలు, ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో వర్క్‌షాప్‌లు, సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి వినూత్న ఆలోచనలను స్వీకరిస్తామని ట్రాఫిక్-I డీసీపీ డాక్టర్​ రవికుమార్ తెలిపారు. “ట్రాఫిక్‌ను సృష్టించేది మనమే; దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా మనదే” అని ట్రాఫిక్-I అదనపు డీసీపీ హనుమంత రావు పేర్కొన్నారు. ఎస్సీఎస్‌సీ సీఈఓ నవీద్ ఆలం ఖాన్, ఇతర సీనియర్ ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Also read: బుల్లెట్ బండి వివాదంలో.. హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్!

Tags

Related News

నేను కావాలని ఆ పదం అనలేదు.. మాట దొర్లాను: మంత్రి సీతక్క!

పెట్టుబడులే లక్ష్యం.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

బరువు తగ్గాలని మీరు కూడా ఇలా చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!

బుల్లెట్ బండి వివాదంలో.. హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్!

తప్పు చేసింది మీరు.. ఇదిగో ఆధారాలు.. ఎంపీ చామల ఫైర్!

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్‌ అయినా కట్టారా? హరీశ్‌రావు

బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త దందా.. వారికి లంచం ఇవ్వకుంటే ఇక అంతే..?

Big Stories

Advertisement
×