E-Paper
Advertisement

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్‌ అయినా కట్టారా? హరీశ్‌రావు

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్‌ అయినా కట్టారా? హరీశ్‌రావు
Advertisement

Harish Rao: తెలంగాణలో కృష్ణా జలాల వాటా, సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.

రిజర్వాయర్లు, లిఫ్టులపై శ్వేతపత్రం డిమాండ్‌

Advertisement

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్‌ అయినా నిర్మించారా? అని హరీశ్‌రావు నిలదీశారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నడిపిందో ప్రజలకు తెలిసేలా వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఎం చెప్పిన జీవో నంబర్‌ తప్పని, ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌కు బదులు నాగార్జున సాగర్‌ కెనాల్‌ అని తప్పుగా ప్రస్తావించారని ఆరోపించారు.

పాలమూరు వర్సెస్‌ కుప్పం నీటి కేటాయింపులు

Advertisement

ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనల మధ్య వ్యత్యాసాన్ని హరీశ్‌రావు గణాంకాలతో వివరించారు. 30 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తే, తమ బీఆర్‌ఎస్‌ హయాంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక పాలమూరులో అదనంగా లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. 2024 డిసెంబర్‌ 3న ఏపీ ప్రభుత్వం 403, 405 జీవోల ద్వారా 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు లైనింగ్‌ పనులు చేయించి కృష్ణా నీళ్లను తరలిస్తుంటే, పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమ ప్రస్థానం, హక్కుల పోరాటం

తెలంగాణ హక్కుల కోసం, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం సెక్షన్‌-3 సాధించేందుకు పోరాడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే అని హరీశ్‌రావు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ముందు జూరాలకు సరైన ఆయకట్టు లేదని, మెదక్‌ జిల్లాలో ఆయకట్టు విస్తరణ కేసీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. ఉమ్మడి ఏపీలో సాగర్‌ కుడి, ఎడమ కాల్వల విషయంలో వివక్ష ఉండేదని, నాడు కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలోనూ, ఇప్పుడు సీఎంగానూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

Also Read: లాడ్జిలో ఘర్షణ.. ప్రియుడు తోసేయడంతో కిటికీలోంచి పడి యువతి మృతి!

Tags

Related News

బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త దందా.. వారికి లంచం ఇవ్వకుంటే ఇక అంతే..?

బీజేపీ డౌన్ అవుతుంది.. మోదీ మళ్లీ అధికారంలోకి రారు: వి. హనుమంత రావు

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కీలక మార్పులు.. ఇకపై వారికే మొత్తం బాధ్యతలు!

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు!

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

Big Stories

Advertisement
×