E-Paper
Advertisement

తప్పు చేసింది మీరు.. ఇదిగో ఆధారాలు.. ఎంపీ చామల ఫైర్!

తప్పు చేసింది మీరు.. ఇదిగో ఆధారాలు.. ఎంపీ చామల ఫైర్!
Advertisement

Krishna Water: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్నది బూటకపు ప్రచారమేనని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. ఓడిపోయిన తర్వాత మూడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ గురించి గొప్పలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు సమాచారంతో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలే శాపంగా మారాయని అన్నారు.

జీవో 72 జారీ..

2013లో జూరాల నుంచి నీటి తరలింపునకు జీవో 72 జారీ చేసారని, 2015లో జీవో 105 ద్వారా ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలానికి మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. సోర్స్ మార్పుతో లిఫ్టులు, పంపులు పెరిగి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందన్నారు. రూ.80 వేల కోట్లకు పైగా అంచనా వ్యయం చేసినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు.

భేటీల వెనుక ఆంతర్యమేంటి?

Advertisement

2014కు ముందు ఉన్న సుమారు 80 వేల ఎకరాల భూసేకరణ తప్ప బీఆర్ఎస్ హయాంలో పెద్దగా భూసేకరణ చేయలేదు. 2015లోనే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల తాత్కాలిక పంపిణీకి అంగీకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం 2019, 2020లో జగన్ రెడ్డితో ప్రగతిభవన్‌లో సమావేశాలు, విందు భేటీల వెనుక ఆంతర్యమేంటి? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు 2020లో జీవో 203 వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయించారని అన్నారు.

2022 ఫిబ్రవరి 16నే జారీ..

పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56 కూడా 2022 ఫిబ్రవరి 16నే జారీ అయిందని గుర్తు చేశారు. గతంలోనే జీవోలు వచ్చినా ఇప్పుడు కొత్తగా జరుగుతున్నట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మా ప్రభుత్వానికి దోపిడీ, కమీషన్ల ఆలోచన లేదని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు నిరంతరం పోరాడుతున్నామని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని, ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు ఆపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత? జాతకం చూసి ఏం చెప్పారంటే!

Tags

Related News

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్‌ అయినా కట్టారా? హరీశ్‌రావు

బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త దందా.. వారికి లంచం ఇవ్వకుంటే ఇక అంతే..?

బీజేపీ డౌన్ అవుతుంది.. మోదీ మళ్లీ అధికారంలోకి రారు: వి. హనుమంత రావు

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కీలక మార్పులు.. ఇకపై వారికే మొత్తం బాధ్యతలు!

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు!

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!

Big Stories

Advertisement
×