E-Paper
Advertisement

Dalitha Bandhu Scam: దళితబంధు స్కామ్.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Dalitha Bandhu Scam: దళితబంధు స్కామ్.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే
Advertisement

Dalitha Bandhu Scam: మెదక్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన జంగిడిగళ్ళ భూమయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దళిత బంధు రెండో విడతలో భాగంగా లిస్టులో తమ పేర్లు వచ్చాయని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాహుల్ కిరణ్.. వారి వద్ద నుంచి ఒక్కో వ్యక్తి దగ్గర మూడు లక్షల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారు. అయితే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలని రాహుల్ ను వేడుకోవడంతో దళిత బంధు కథ అడ్డం తిరిగింది. డబ్బులు ఎవరికి ఇచ్చావు అంటూ బాధితునికి దబాయించే ప్రయత్నం చేశారు రాహుల్ కిరణ్.

Advertisement

అంతేకాకుండా ఫోన్ కాల్ లో నోటికి వచ్చినట్లు బాధితున్ని బూతు పురాణాలతో తిట్టడమే కాకుండా.. ఇంటికి వచ్చి లేపేస్తా అంటూ బాధితుడిని బెదిరించసాగాడు బిఆర్ఎస్ నాయకుడు. దాంతో దళిత బంధు పేరిట ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారని బాధితుడు భూమయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×