Jubilee Hills bypoll: ఎట్టకేలకు జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యాడు. పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన రేపోమాపో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు మొదలైన మూడు రోజుల తర్వాత అభ్యర్థిని ప్రకటించడం వెనుక అసలేం జరిగింది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కనుంది. నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టి బుధవారం నాటికి మూడు రోజులైంది. ఇప్పటివరకు 20 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. లేటెస్ట్‌గా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకాల దీపక్‌రెడ్డి పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేయడం, ఆపై ప్రకటన చేయడం చకచకా జరిగిపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైకమాండ్ ఆయన పేరు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం సమావేశమైంది. ఆ తర్వాత ముగ్గురు సభ్యుల కమిటీ నియమించింది.
ఆ కమిటీ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది. వారిలో దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత ఉన్నారు. ఆ జాబితాను అక్టోబర్ 12న అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ హైకమాండ్‌కు అందజేశారు. అదేరోజు బీహార్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఉండడంతో హైకమాండ్ దృష్టి పెట్టలేదని పార్టీ వర్గాల మాట.
నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనా పార్టీ హైకమాండ్ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని ప్రత్యర్థుల నుంచి కామెంట్లు పడిపోయాయి. ఈ తతంగం జరుగుతుండగా బుధవారం ఉదయం పార్టీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరు ప్రకటించింది బీజేపీ హైకమాండ్.
ALSO READ: తెలంగాణ రైజింగ్ విజన్-2047, సిటిజన్ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం
అభ్యర్థి ప్రకటన ఆలస్యం వెనుక కారణాలు ఏంటంటూ చర్చించుకోవడం ఆ పార్టీలో మొదలైంది. పార్టీ హైకమాండ్ వద్ద కొందరు నాయకులు లాబీయింగ్ వల్ల డిలే అయినట్టు వార్తలు లేకపోలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు ఆయన. దీపక్‌రెడ్డి ప్రకటన రావడంతో నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కేడర్ ఓ వైపు.. నేతలు మరోవైపు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. నేతలు విభేదాలు మరిచి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు.
BREAKING
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి
అధికారికంగా ప్రకటించిన బీజేపీ pic.twitter.com/7fbwJ4plGF
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2025