BigTV English

Bigg Boss 9 Srija : శ్రీజ నోటి దూల… ఆ వీడియో వల్లే బిగ్ బాస్ నుంచి అవుట్ ?

Bigg Boss 9 Srija : శ్రీజ నోటి దూల… ఆ వీడియో వల్లే బిగ్ బాస్ నుంచి అవుట్ ?
Advertisement

Bigg Boss 9 Srija :బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా జరుగుతున్న వేళ 5 వారం ఎలిమినేషన్ లో భాగంగా ఇద్దరినీ డబుల్ ఎలిమినేషన్ పేరుతో బయటికి పంపించేశారు. అయితే ఈ ఎలిమినేషన్ లో ఒకరు హీరోయిన్ ఫ్లోరో సైనీ కాగా.. మరొకరు కామనర్ గా వచ్చిన దమ్ము శ్రీజా.. అయితే దమ్ము శ్రీజా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సమయంలో చాలామంది షాక్ అయిపోయారు. హౌస్ లో అంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చి అద్భుతంగా ఆడిన ఈమెని ఎందుకు బయటికి పంపించేసారని చాలామంది ఆశ్చర్యంలో మునిగిపోయారు. అంతేకాదు కనీసం శ్రీజా AV ని కూడా స్క్రీన్ పై చూపించకుండానే బయటికి పంపించేశారు. దీంతో చాలామంది బిగ్ బాస్ కావాలనే శ్రీజాని ఎలిమినేట్ చేశారని, మళ్ళీ హౌస్ లోకి శ్రీజాని వైల్డ్ కార్డు ద్వారా తీసుకోవాలని పెద్ద ఎత్తున పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.


శ్రీజ వీడియో వైరల్..

ఇదిలా నడుస్తున్న సమయంలో తాజాగా శ్రీజా మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో కారణంగానే శ్రీజాని నాగార్జున (Nagarjuna ) కావాలనే హౌస్ నుండి బయటికి పంపించేశారనే ప్రచారం నడుస్తోంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? ఆ వీడియో కారణంగా నాగార్జున ఎందుకు ఎలిమినేట్ చేసారు? అనేది ఇప్పుడు చూద్దాం..

సమంత – నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ కామెంట్లు..

తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ దమ్ము శ్రీజా బిగ్ బాస్ కి రాకముందు మాట్లాడిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. వాడు ఎక్స్ వైఫ్ తో ఫోటో పోస్ట్ చేశాడో..లేక వాడి కుక్క ఫోటోనే పోస్ట్ చేశాడో తెలియదు.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ సెలబ్రిటీ జంట పది సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు బాగానే కలిసి ఉండి, ఆ తర్వాత ఏమైందో ఏమో సడన్గా విడిపోదామని ఫిక్స్ అయ్యారు. అలా మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటున్నామని ఇద్దరు పోస్టులు పెట్టారు. వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఈ విడాకుల వార్త చాలా వైరల్ అయింది. అంతేకాకుండా ఈ విడాకుల వార్తలపై చాలామంది రూమర్స్ క్రియేట్ చేసి హస్బెండ్ చీట్ చేశాడని, అందుకే ఆ హీరోయిన్ వదిలేసిందని ఇలా ఎంతోమంది అనుకున్నారు. కానీ సడన్ గా ఆ హీరోయిన్ ఎవరితోనైతే కలిసి తన భర్త తనని చీట్ చేశాడు అనుకుందో చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.


చీప్ మెంటాలిటీ అంటూ నాగచైతన్య పై విమర్శలు..

ఇదంతా పక్కన పెడితే.. రేపు తన మాజీ భార్య పుట్టినరోజు ఉంది. అనగా ముందు రోజే ఆ మాజీ భార్య తాను నిర్మాతగా చేసిన సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసుకుంది. కానీ ఈయనకి ఏమైందో ఏమో గానీ సడన్ గా తన రెండో భార్యతో అలాగే ఆ ఎక్స్ వైఫ్ తో కలిసి కో పేరేంటింగ్ గా ఉన్న పెట్ డాగ్ తో కలిపి ఓ పోస్ట్ పెట్టారు. అయితే అంత సడన్గా ఆ పోస్టు పెట్టాల్సిన అవసరం ఏముంది.? ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా సడన్గా తన ఎక్స్ వైఫ్ బర్త్డే ముందు రోజే అలాంటి పోస్ట్ పెట్టడం.. నిజంగా ఆమెను హర్ట్ చేయడం కోసమే కదా. రీసెంట్ గా పెళ్లయింది. ఇన్ని రోజులు పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు పెట్టడం ఏంటి.. ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆయన ఎక్స్ వైఫ్ బర్త్డే రోజు పోస్ట్ పెట్టినా కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ సడన్గా నెక్స్ట్ డే బర్త్డే ఉంది అనగా ఆమె ముందు రోజు ట్రైలర్ రిలీజ్ చేసుకున్న రోజే ఇలాంటి పోస్ట్ పెట్టడం అంటే నిజంగా ఆయనది ఎంత చీప్ మెంటాలిటీనో కనబడుతుంది” అనే అర్థం వచ్చేలా శ్రీజ పేర్లు చెప్పకుండా వీడియో షేర్ చేసింది.

ఇదంతా కక్ష సాధింపు చర్యలేనా..?

అయితే ఈ ఏడాది ఏప్రిల్ 27న నాగచైతన్య (Naga Chaitanya), శోభిత (Sobhita) అలాగే పెట్ డాగ్ తో కలిసి ఉన్న పోస్ట్ చేశారు. అదేరోజు సమంత శుభం మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇక తర్వాత రోజు అంటే ఏప్రిల్ 28 న సమంత బర్త్డే.అలా సమంత – నాగచైతన్య గురించి ఈ వీడియోలో శ్రీజ మాట్లాడింది. అయితే ఈ వీడియో అప్పుడేమో గాని ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే శ్రీజాని నాగార్జున కావాలనే హౌస్ నుండి డబుల్ ఎలిమినేషన్ పేరుతో పంపించారనే ప్రచారం జరుగుతోంది.

ALSO READ:Kantara Chapter 2: రిషబ్ మాస్టర్ ప్లాన్.. అలాంటి పాత్రలో ఎన్టీఆర్ !

శ్రీజ ఎలిమినేషన్ పై అసలు నిజం ఏంటి?

అయితే చాలామంది ఇలాంటి నెగిటివ్ వీడియోస్ చేసినప్పుడు ఆ టైంలో వైరల్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళు ఇలా సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎక్కువ వైరల్ అవుతాయి.అలా శ్రీజ దమ్ము బిగ్ బాస్ లోకి వచ్చాక ఈ వీడియో మళ్లీ చక్కర్లు కొట్టడంతో ఇది కాస్త నాగార్జున దృష్టికి వచ్చి శ్రీజాని కావాలనే ఎలిమినేట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి శ్రీజాపై నాగార్జున పగ పెంచుకొనే ఎలిమినేట్ చేశారా..లేక ఓటింగ్ ప్రకారమే ఆమెను బయటికి పంపించారా అనేది మాత్రం తెలియదు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై శ్రీజా ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

?utm_source=ig_web_copy_link

Related News

Bigg Boss 9: రమ్య ఫుడ్ లిస్ట్.. దెబ్బకు పడిపోయిన రీతూ.. అందుకే సుమన్ ను ఎంచుకున్నావా తల్లీ!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి శ్రీజ రీఎంట్రీ.. ఆడియన్స్ కు మెంటలెక్కించే ట్విస్ట్..

Bigg Boss 9 Telugu: పవన్ ను లైన్లో పెడుతున్న రమ్య.. ఆ ముగ్గురికి పట్టపగలే చుక్కలు..

Bigg Boss 9: దివ్య వర్సెస్ మాధురి.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా, రీతూకి దివ్య మాస్ వార్నింగ్

Bigg Boss Telugu 9: ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం హౌజ్ ని విడేది వీళ్లే, ఎవరేవంటే!

Duvvada Madhuri : మాధురి ఇది మీ ఇల్లు కాదు, రెచ్చిపోయిన దువ్వాడ మాధురి 

Bigg Boss Ritu Chaudhary : రీతూ చౌదరికి సీజన్ అంతా అడుక్కోవడమే పని అయిపోయింది

Big Stories

×