Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజు మధ్యాహ్నం వరకు భారీ ఎండ కొట్టిన వాతావరణం ఒక్కసారిగా మబ్బులు కమ్మేసీ రాష్ట్రంలో వర్షం దంచికొడుతుంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కేవలం అక్కడక్కడ మాత్రమే పడ్డాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. ఈ క్రమంలో నేడు వరంగల్, నాగర్ కర్నూల్, జనగామ, వనపర్తి, మేడ్చల్, మహబూబాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, మల్కాజిగిరి, గద్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని చెబుతున్నారు.
ఏపీలో వాతావరణ ఇలా..
ఏపీలో రెండు రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యే ఛాన్సుందని IMD తెలిపింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిష్క్రమించినట్లు తెలిపారు.. ఇదే టైమ్‌లో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయంది. దీంతో ఉపరితల ఆవర్తనాలతో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు TPT, NLR, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కర్నూల్, అనంతపురం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు..
Also Read: అమరావతి రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212కోట్లతో మాస్టర్ ప్లాన్..
జాగ్రత్తలు..
మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని.. అలాగే మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అధికారులు తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలి..అస్సలు బయటకు వెళ్లకుండా ఉండలన్నారు.
AP: రెండు రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యే ఛాన్సుందని IMD పేర్కొంది.
ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఇదే టైమ్‌లో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయంది.
ఉపరితల ఆవర్తనాలతో పలు జిల్లాల్లో రాబోయే… pic.twitter.com/sY69JmilIf
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2025