E-Paper
Advertisement

Hyderabad : పెట్రోల్ బంకుల వద్ద రద్దీ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ..

Hyderabad : పెట్రోల్ బంకుల వద్ద రద్దీ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ..
Advertisement
Hyderabad latest news

Hyderabad latest news:

ఆకలి వేసి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసే పని.. ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫుడ్ డెలివరీ యాప్స్ కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఫుడ్ డెలివరీ కోసం పలు యాప్ లు అందుబాటులో ఉన్నాయి. పోటాపోటీగా ఎవరికి వారు డెలివరీలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు, ఈ ఏజెంట్లు బైక్‌లపై, సైకిళ్లపై, కాలినడకన కూడా రావడం మీరు చూసి ఉండవచ్చు.

Advertisement

కానీ.. మీకు ఎప్పురైనా గుర్రం ద్వారా ఆహారం అందించారా? అవును, మీరు చదివింది నిజమే! ఒక జొమాటో (Zomato) డెలివరీ ఏజెంట్ గుర్రంపై ఆహారాన్ని డెలివరీ చేస్తూ కనిపించాడు. హైదరాబాద్ లో పెట్రోలు బంక్ ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ జొమాటో డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ ఆర్డర్ అందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటన హైదరాబాద్ చంచల్‌గూడలో చోటు చేసుకుంది. జొమాటో డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ ఆర్డర్ అందించడానికి వెళ్తున్న దృశ్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. జొమాటో డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నానని..పెట్రోల్ బంకులు వద్ద ఉన్న భారీ క్యూలు, పలు బంక్ లు బంద్ కారణంగా ఇలా గుర్రంపై ఆర్డర్ డెలివరీ చేస్తున్నానని డెలివరీ బాయ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

వీడియో చూసిన వారు తన బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో వినూత్న ఆలోచనతో వచ్చాడని అంటున్నారు. గతంలో ముంబయిలో భారీ వర్షాల మధ్య ఆహారాన్ని అందించడానికి ఓ వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియో ప్రజలకు గుర్తు చేసింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×