E-Paper
Advertisement

బోనాల జాతరలో భక్తుల అవస్థలు.. వీఐపీలకు స్పెషల్ దర్శనం, ప్రజాసేవలో ‘బిగ్ టీవీ’

బోనాల జాతరలో భక్తుల అవస్థలు.. వీఐపీలకు స్పెషల్ దర్శనం, ప్రజాసేవలో ‘బిగ్ టీవీ’
Advertisement

Secunderabad Bonalu Jatara: సికింద్రాబాద్‌లో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు దర్శించుకుంటూనే ఉన్నారు. జంట నగరాల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

వైభవంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ టికెట్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు నేరుగా టికెట్లు పొందే అవకాశం కల్పించారు. దర్శనం తర్వాత భక్తులు వెళ్తుంటే.. వచ్చేవారు కూడా అదే విధంగా వస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంత ఇరుక్కుగా ఆలయ పరిసరాల్లో ఉంది. నిన్నటి వరకు వాతావరణ కాస్త మబ్బుగా ఉన్నా, ఇవాళ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

తరలివస్తున్న భక్తులు

Advertisement

ఎండలు దంచి కాస్తున్నాయి. ఫలితంగా మూడు గంట‌లుగా భ‌క్తులు తీవ్ర అవ‌స్థలు పడుతున్నారు. క్యూలెన్ అస్సలు కదలడం లేదు. మధ్యలో సెలబ్రిటీలు, పొలిటీషయన్లు, అధికారులు హడావుడి ఎక్కువగా ఉంది. సామాన్యుల కంటే అధికారులు వీరికే ఎక్కువగా పరిమితమయ్యారు. వారికి కాసేపు బోనాలు సమర్పించేవారిని పంపిస్తే బాగుండేదని అంటున్నారు. కనీసం అస్సలు క్యూలైన్ కదిలే పరిస్థితి కనిపించలేదు.

Advertisement

క్యూలైన్లలో భక్తులు ఎండకు తాళలేక భ‌క్తులు సృహ త‌ప్పిపడిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. పెద్దలే కాదు.. చిన్నారులు కూడా క్యూలైన్లలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈలోగా పోలీసులు-సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.ఉపవాసంతో అమ్మవారిని దర్శించుకోవాలని కొందరు భక్తులు బోనంతో వస్తున్నాయి. అలాంటి వారికి ఎండ దెబ్బకు అల్లాడిపోతున్నారు.

అక్కడ పరిస్థితి గమనించిన బిగ్ టీవీ టీం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమగ్నమైంది. భక్తులకు వాటర్ ప్యాకెట్స్ అందజేస్తోంది. ప్రజాసేవలో బిగ్ టీవీ నిమగ్నమైంది. క్యూలైన్లలో కదలిక లేకపోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము నిలబడి మూడు గంటలు అవుతుందని కనీసం క్యూలైన్ కదల్లేదని చెబుతున్నారు. కనీసం బోనం పెట్టుకుని వచ్చేవారికి వేరే లైన్ ఏర్పాటు చేయలేదు. మరోవైపు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు.

ALSO READ: కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం

Related News

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

Big Stories

Advertisement
×