E-Paper
Advertisement

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Ujjaini Mahakali: సికింద్రాబాద్‌ లష్కర్ వీధులు ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తున్నాయి. ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు, శివసత్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి విశేష పూజలు

Advertisement

ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

Also Read: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

Advertisement

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, బంగారు బోనం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు , ప్రముఖులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

Tags

Related News

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

Big Stories

Advertisement
×