E-Paper
Advertisement

కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం

కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం
Advertisement

Hanumakonda: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్నట్లుండి ఏమైందో తెలీదు. కాకపోతే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు పట్టరాని కోపంతో భార్య చేతులు-కాళ్లు కట్టేశాడు ఆమె భర్త. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన హనుమకొండలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

హనుమకొండలో దారుణమైన ఘటన

హనుమకొండలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 4వ డివిజన్‌లో ఉంటున్నారు అనిల్‌కుమార్- రజిత దంపతులు. నర్సంపేటలోని రాజపల్లి ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్.. కొడకండ్ల మండలం ఏడు నూతుల తండాకు చెందిన రజిత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులున్నారు. వీరికి వివాహం జరిగి కేవలం ఆరేళ్లు మాత్రమే అయ్యింది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. కొంతకాలంగా అనిల్ కుటుంబంలో గొడవలు తీవ్రమవుతున్నాయి.

Advertisement

రాత్రి ఘటన.. చిన్నారుల మాటేంటి?

శనివారం మధ్యాహ్నం నుంచి ఇంట్లో అనిల్-రజిత గొడవ జరిగింది. ఈ క్రమంలో రజిత చేతులు-కాళ్లు కట్టేశాడు భర్త అనిల్. ఆ తర్వాత అక్కడే ఉన్న కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన నుంచి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన తీరును రజిత కొడుకు పోలీసులకు వివరించాడు. తల్లి హత్యకు గురికావడంతో తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమా లేక మరేవైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:ఆపరేషన్ ముస్కాన్ -12 సక్సెస్..  6,307 మంది చిన్నారులను కాపాడిన తెలంగాణ పోలీసులు!

Related News

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

Big Stories

Advertisement
×