BigTV English

TS Politics: తాటతీస్తా.. పది రోజులు టైమ్ ఇస్తున్నా.. బండి వర్సెస్ ఇంద్ర

TS Politics: తాటతీస్తా.. పది రోజులు టైమ్ ఇస్తున్నా.. బండి వర్సెస్ ఇంద్ర

TS Politics: ప్రజాసంగ్రామ యాత్రతో మరింత దూకుడు మీదున్నారు బండి సంజయ్. నిత్యం సీఎం కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసే బీజేపీ చీఫ్.. ఈసారి ఓ మంత్రిపై విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బండి పాదయాత్ర కొనసాగుతుండగా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు.


మంత్రి అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందని.. మున్సిపల్ స్కాంలో తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు బండి సంజయ్. మీడియా ముందు పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా కలెక్టర్ కూ ఝలక్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అవినీతికి సహకరించిన కలెక్టర్ సంగతి చూస్తామన్నారు బండి సంజయ్.

బండి వ్యాఖ్యలపై అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పది రోజులు టైమ్ ఇస్తున్నా.. దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని.. అసలు బీజేపీ ప్రజలకు ఏమి చేసిందో బండి సంజయ్ చెప్పాలని ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.


మరి, మంత్రి సవాల్ ను బండి సంజయ్ స్వీకరిస్తారా? పది రోజుల్లో ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెడతారా? ఇలా వారిద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లతో నిర్మల్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×