Ramachandru Naik: డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి భారీ ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కారు ఆపి పరిశీలించారు. ఇక వివరాల్లోకి వెలితే ఉన్నాయి.
డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కారులో ప్రయాణిస్తున్నారు. దీంతో ఆయన కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలి కారులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కారును ఆపి పరిశీలించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. నేడు ఎమ్మెల్యే రామచంద్రానాయక్ మహబూబాబాద్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
Also read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్
కారులో ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో హుటాహుడిన అప్రమత్తమైన సిబ్బంది ఎమ్మెల్యేను కారులో నుండి దింపి కారును నిశితంగా పరిశీలించారు. పవర్ బ్యాంక్ కారణంగానే ఈ ప్రమాదం జరగడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ వార్త విన్న ఎమ్మెల్యే పార్టీ శ్రేనులు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంపై పూర్తి సమాచారం తెలుసుకున్న శ్రేనులు ఎలాంటి నష్టం జరగలేదని తెలియగా శాంతించారు.
Also Read: మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!
ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తప్పిన ప్రమాదం
డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా.. కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఎమ్మెల్యేను సురక్షితంగా వేరే వాహనంలో తరలించారు. కాగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.#Mahabubabad… pic.twitter.com/OLO4RFVmiY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 17, 2026