E-Paper
Advertisement

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?
Advertisement

Gmail Confidential Mode:  ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మనం పంపే.. ఈ మెయిల్స్ ఎంతవరకు సేఫ్? మన పర్సనల్ ఫోటోలు, పాస్‌వర్డ్‌లు లేదా ఆఫీస్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాధారణంగా మెయిల్ పంపాక దాన్ని ఎవరైనా ఫార్వర్డ్ చేయొచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. కానీ గూగుల్ అందించిన ఒక అద్భుతమైన ఫీచర్ ద్వారా.. మీ మెయిల్స్ పూర్తిగా మీ కంట్రోల్‌లో ఉంటాయి. అదే జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్. ఈ ఫీచర్ గురించి, దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం!

జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్ అంటే ?

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు, డేటా ప్రైవసీ ఆందోళనలు విపరీతంగా పెరిగిపోయాయి. మనం ఎవరికైనా ఒక మెయిల్ పంపిస్తే.. అవతలి వ్యక్తి ఆ మెయిల్‌ను వేరే వాళ్ళకి.. ఫార్వర్డ్ చేయడం, ప్రింట్ తీసుకోవడం లేదా డౌన్‌ లోడ్ చేయడం వంటివి చేయొచ్చు. ఒక వేళ పొరపాటున తప్పు మెయిల్ ఐడీకి ఆ డాక్యుమెంట్ వెళితే మన ప్రైవసీ గాలిలో కలిసి పోతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికే గూగుల్ ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ను అందుబాటులోకి తెచ్చింది.

కాన్ఫిడెన్షియల్ మోడ్ అంటే ఏంటి?

Advertisement

జీమెయిల్‌లోని ఈ ప్రత్యేక మోడ్ ద్వారా.. మనం పంపే ఈమెయిల్స్‌కు ఒక తాత్కాలిక సేఫ్టీ ఏర్పాటు చేయవచ్చు. అంటే మనం పంపిన మెయిల్ నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా.. సెట్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా కలిగే  ప్రయోజనాలు:

1. ఫార్వర్డ్,కాపీ,డౌన్‌లోడ్ :
మీరు కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో మెయిల్ పంపిస్తే.. రిసీవర్ ఆ మెయిల్‌లోని టెక్స్ట్ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఫార్వర్డ్ చేయడానికి, కాపీ చేయడానికి, ప్రింట్ తీసుకోవడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి జీమెయిల్ అనుమతించదు. కేవలం చదవడానికి మాత్రమే వీలుంటుంది.

Advertisement

2. ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేయడం :
మీరు పంపే మెయిల్ ఎంత కాలం ఉండాలనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ఒక రోజు, ఒక వారం, లేదా మూడు నెలలు.. ఇలా గడువు ముగిసిన తర్వాత ఆ మెయిల్ ఆటోమేటిక్‌గా అవతలి వారి ఇన్‌ బాక్స్ నుంచి మాయమైపోతుంది.

3. ఎస్‌ఎంఎస్ పాస్‌కోడ్ సేఫ్టీ:
మీరు పంపే మెయిల్ కేవలం సరైన వ్యక్తి మాత్రమే చూసే లాగా ‘SMS Passcode’ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని వల్ల రిసీవర్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ మెయిల్ ఓపెన్ అవుతుంది. అత్యంత గోప్యమైన సమాచారం పంపేటప్పుడు ఇది చాలా ఉపయోగ పడుతుంది.

4.ఎప్పుడైనా యాక్సెస్ నిలిపివేయొచ్చు:
మీరు మెయిల్ పంపాక, పొరపాటున తప్పు వ్యక్తికి పంపానని గుర్తిస్తే.. వెంటనే ‘Revoke Access’ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా అవతలి వ్యక్తికి ఆ మెయిల్ కనిపించకుండా చేయొచ్చు.

Also Read: కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

దీన్ని ఎలా ఉపయోగించాలి?

1.మీ జీమెయిల్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ‘Compose’ పై క్లిక్ చేయండి.

2.మెయిల్ రాసే విండో కింద కుడి వైపున ఉండే తాళం చెవి సింబల్ కనిపిస్తుంది. అదే కాన్ఫిడెన్షియల్ మోడ్ ఐకాన్. దానిపై క్లిక్ చేయండి.

3.అక్కడ ఎక్స్‌పైరీ టైమ్ (ఉదాహరణకు: 1 వారం), పాస్‌కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ‘Save’ చేయండి.

4.ఇక సాధారణంగానే మెయిల్ సెండ్ చేయొచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఖర్చు లేదా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.

డేటా సేఫ్టీ అనేది నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యం. ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే మీ డేటా ఎప్పటికీ సేఫ్‌గా ఉంటుంది. తెలివైన వాళ్ళలా మీ డిజిటల్ ప్రైవసీని కాపాడుకోవడానికి ఇప్పుడే జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను వాడటం ప్రారంభించండి!

Related News

కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

Big Stories

Advertisement
×