KCR Land: 2004 వరకు కేసీఆర్‌కు ఒక్క ఎకరా భూమి కూడా లేదని సంచలన విషయాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బైటపెట్టారు. స్వయంగా కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేసిన విషయాలను మంత్రి పొంగులేటి తెలిపారు. సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని అన్నారు.
ఎన్నికల అఫిడవిట్‌తో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్‌లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తెలిపారని, మరి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి పోంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్‌కి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుందని పోంగులేటి అన్నారు.
Also read: మెట్రో పిల్లర్ల కింద గుంతలు.. అధికారులకు కాల్ చేస్తే.. లైవ్‌లోనే కడిగిపారేసిన బిగ్ టీవీ రిపోర్టర్లు!
బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయని, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయి ఇది ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా అని పొంగులేటి అన్నారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న ఘనులు కల్వకుంట్ల కుటుంబం అని మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతోనే కేసీఆర్‌కి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న కేటీఆర్, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా అంటూ కేటీఆర్ పై మంత్రి పొంటగులేటి సెటైర్లు వేసారు.
Also read: రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?