E-Paper
Advertisement

చేయూత పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఇదే..?

చేయూత పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఇదే..?
Advertisement

Cheyutha Pension: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న ‘చేయూత’ పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా భారీగా కొత్త దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 5,98,193 నూతన దరఖాస్తులు నమోదయ్యాయి.కేటగిరీల వారీగా అప్లికేషన్లు చేయూత పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో వితంతువులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వితంతువులు 3,31,236 దరఖాస్తులు రాగా, దివ్యాంగులు 1,48,882 మంది, ఒంటరి మహిళలు 62,689మంది, గీత కార్మికులు 37,381, నేత కార్మికులు 18,005 దరఖాస్తులు వచ్చాయి.

అగ్రస్థానంలో..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 46,540 అప్లికేషన్లతో అగ్రస్థానంలో నిలవగా, అత్యంత అల్పంగా ములుగు జిల్లా నుంచి కేవలం 4,818 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ 46,5402, రంగారెడ్డి 38,2933, నల్గొండ32,993, మేడ్చల్ మల్కాజ్‌గిరి 32,968, ఖమ్మం27,772, కరీంనగర్24,636, నిజామాబాద్24,075, సూర్యాపేట22,494, సంగారెడ్డి21,011, భద్రాద్రికొత్తగూడెం19,352, యాదాద్రిభువనగిరి18,310, జగిత్యాల17,49513వికారాబాద్17,40714మహబూబ్‌నగర్15,57715ఆదిలాబాద్15,46816వరంగల్15,337, పెద్దపల్లి15,265, మహబూబాబాద్15,197, హనుమకొండ14,956, కామారెడ్డి14,821, సిద్దిపేట14,481, నాగర్‌కర్నూల్14,327, మంచిర్యాల13,746, వచ్చాయి.

Advertisement

Also Read: ప్రతి పైసా లెక్కిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు

మంత్రి సీతక్క..

మెదక్13,735, నారాయణపేట13,245, జోగులాంబ-గద్వాల12,270, నిర్మల్11,915, జనగామ11,828, వనపర్తి10,320, రాజన్న-సిరిసిల్ల10,037, కొమరంభీం-ఆసిఫాబాద్9,467, జయశంకర్-భూపాలపల్లి8,037, ములుగు4,818 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసింది. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన, అర్హతల తనిఖీ అనంతరం లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు.అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్ణీత ప్రక్రియ ప్రకారం పరిశీలన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా పారదర్శకంగా, వేగంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలనిస్పష్టం చేశారు.

Advertisement

Also read: మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

Tags

Related News

డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన భారీ ప్రమాదం.. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

Big Stories

Advertisement
×