E-Paper
Advertisement

నంది అవార్డుకు కులం అడ్డొచ్చిందా? ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఉదయభాను కామెంట్స్!

నంది అవార్డుకు కులం అడ్డొచ్చిందా? ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఉదయభాను కామెంట్స్!
Advertisement

Udayabhanu: ఉదయభాను పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమాలలో కూడా నటిస్తూ నటిగా మెప్పించారు. ఇలా ఒకానొక సమయంలో యాంకర్ అంటే ఉదయభాను(Udayabhanu) మాత్రమే గుర్తుకు వచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో ఈమె యాంకరింగ్ కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను ప్రొడక్షన్ హౌస్ పేరిట నిర్మాతగా మారారు తన ప్రొడక్షన్లో ఇటీవల ఈమె పంచనామా(Panchanaama) అనే వెబ్ సిరీస్ నిర్మించిన సంగతి తెలిసిందే.

నంది అవార్డులను అడ్డుకున్నారు..

ఈ సిరీస్ ప్రస్తుతం జీ ఫైవ్ లో ప్రసారమవుతుంది .ఇక ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఉదయభాను వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయభాను ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా నంది అవార్డులు(Nandi Awards) తనకు రాకపోవడం గురించి కూడా ఈమె మాట్లాడారు. యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న తనకు నంది అవార్డులు రావాల్సి ఉన్నప్పటికీ కొంతమంది అడ్డుకున్నారని తెలిపారు.

కులం పేరుతో దూషించారు..

Advertisement

నంది అవార్డుల సమయంలో జ్యూరీ లో భాగంగా తన పేరు వెళ్లినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక లేడీ తనను కులం పేరుతో దూషిస్తూ నంది అవార్డు రాకుండా అడ్డుకుందని ఈమె తెలిపారు. ఇప్పటికే ఉదయభానుకు కళ్ళు నెత్తికెక్కాయి, ఇక నంది అవార్డు ఇస్తే మరింత ఎక్కిపోతుంది అంటూ కులం పేరుతో నన్ను దూషించి మరి ఈ అవార్డు రాకుండా అడ్డుకుందని ఉదయభాను తెలిపారు. ఇలా నంది అవార్డు గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో నంది అవార్డుకు కూడా కులం అడ్డొస్తుందా? అంటూ అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

స్టేజ్ ఎక్కకుండా వెనక్కి వెళ్ళాను..

ఇలా ఇండస్ట్రీలో నాకు మాత్రమే కాదు చాలామందికి కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఏ విషయం అయినా నిర్మొహమాటంగా బయట మాట్లాడుతాను కాబట్టి నా విషయాలను బయటకు చెప్పుకున్నాను కానీ చాలామంది నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది అంటూ బాధపడుతుంటారని ఈమె తెలిపారు. ఇండస్ట్రీలో జరిగే రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ.. కొంతమందిని కెరియర్ పరంగా ఉద్దేశపూర్వకంగా తొక్కేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ గా తనకు అవకాశాలు వచ్చినప్పటికీ ఈవెంట్ వరకు వెళ్లి స్టేజ్ ఎక్కకుండా వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని వీటన్నిటి వెనుక రాజకీయాలే ప్రధాన కారణమని,  అందుకే తాను ఒకానొక సమయంలో అవకాశాలను కోల్పోయానని ఉదయభాను ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

Related News

యాంకర్ సుమతో గొడవలు.. అసలు విషయం చెప్పిన ఉదయభాను

పొలిటికల్ ఎంట్రీ పై ఉదయభాను క్లారిటీ… పోరాటం చేయాల్సిందే అంటూ!

ఆ హీరోలకు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా అదే – ఉదయభాను

వేణుమాధవ్ తో నాకున్న బంధం అదే.. ఆఖరి రోజుల్లో ఏం అన్నాడంటే – ఉదయభాను

మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్.. శృతి ఫుల్ హ్యాపీ.. బాలుకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను ఇంటికి రమ్మన్న కార్తీక్         

Big Stories

Advertisement
×